అన్వేషించండి

Bobby Deol: అప్పట్లో తాగి ఊగేవాళ్లం, అదే ఇప్పుడు పనికొచ్చింది - ‘యానిమల్’ ఎంట్రీ డ్యాన్స్‌పై బాబీ డియోల్ కామెంట్స్

Bobby Deol: ‘యానిమల్‘ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఈ పాటలో స్టెప్పుల గుర్తించి తాజాగా బాబీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Bobby Deol On Viral Entry Scene In Animal Movie: దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంత చేసుకున్న మూవీ ‘యానిమల్‘. విడుదలైనప్పటి నుంచి ఎవరి నోట విన్నా ఈ సినిమా ప్రస్తావనే వస్తుంది. ఈ చిత్రంలోని సన్నివేశాల గురించి ఏకంగా పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మాట్లాడుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటన మాత్రమే కాదు, విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఆయన పాత్ర ఈ సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా, తన సినీ కెరీర్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. బాబీ డియోల్ ఈ మూవీలో ‘అబ్రార్‘ అనే నెగెటివ్ రోల్ పోషించారు. మూవీ సెకెండ్ పార్ట్ లో ఎంట్రీ ఇస్తారు. తన మూడవ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతారు. ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.   

ఎంట్రీ సీన్ కోసం ఎంతో కష్టపడ్డారు- బాబీ డియోల్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్, ‘యానిమల్‘ మూవీలో తన ఎంట్రీ సీన్ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మంచి సంగీత అభిరుచి కలిగి ఉందన్నారు. ముందే ఆయన తనను సాంగ్‌ను వినాలని చెప్పినట్లు వెల్లడించారు. ఈ పాటను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎంట్రీ సీన్ లో ప్లే చేస్తున్నట్లు చెప్పారు. ఆయన ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డట్లు చెప్పారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో శ్రమకు తగిన ఫలితం దక్కినట్టు అయ్యిందన్నారు.  

చిన్నప్పటి విషయం మళ్లీ గుర్తుకు వచ్చింది- బాబీ డియోల్

ఈ పాట షూటింగ్ లో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగినట్లు బాబీ డియోల్ వెల్లడించారు. “షూటింగ్ ప్రారంభించినప్పుడు కొరియోగ్రాఫర్ నువ్వు డ్యాన్స్ చెయ్ అని చెప్పారు. ఏం చేయాలో తెలియక నాకు తోచినట్లు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. బాబీ డియోల్ లా చేయకు. కొత్తగా ట్రై చెయ్యమన్నారు. అప్పుడు నాకు చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నా చిన్నప్పుడు పంజాబ్‌కు వెళ్లే సందర్భం గుర్తుకు వచ్చింది. తాగే సమయంలో తల మీద గాజు గ్లాసులు ఎలా పెట్టుకునే వాళ్లమో గుర్తుకు వచ్చింది. సేమ్ అప్పటి లాగే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. దర్శకుడు సందీప్‌కు నా డ్యాన్స్ బాగా నచ్చింది. ఓకే చేశారు” అని చెప్పుకొచ్చారు.

‘యానిమల్’ మూవీ గురించి..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. త్రిప్తి దిమ్రి సెకెండ్ హీరోయిన్ గా చేసింది. సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా ఇతర పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget