అన్వేషించండి

Bobby Deol: బాబీ డియోల్... బాలీవుడ్‌లో పవన్ సినిమాకు ప్లస్సే - 'యానిమల్'కు మించి ఉంటుందా?

Hari Hara Veera Mallu Movie: 'హరి హర వీరమల్లు'లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్‌లో ఆయన రోల్ చూపించారు. దాంతో చాలా మందికి 'యానిమల్' గుర్తుకు వచ్చింది.

Bobby Deol Role In Hari Hara Veera Mallu Movie: బాబీ డియోల్... ఇప్పుడీ బాలీవుడ్ సీనియర్ హీరోకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయన వెతుక్కుంటూ విలన్ రోల్స్ వెళుతున్నాయి. థాంక్స్ టు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా... ఒక్క సినిమాతో బాబీ డియోల్ రేంజ్ అమాంతం మార్చేశాడు. 'యానిమల్'తో ఆయనకు సరికొత్త ఇమేజ్ తీసుకు వచ్చాడు. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్, స్టార్ డమ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. 'యానిమల్'కు మించి అనేట్టు... 'హరి హర వీరమల్లు'లో ఆయన క్యారెక్టర్ ఉండవచ్చని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్!?
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' టీజర్ ఇవాళ విడుదలైంది. అందులో పవర్ స్టార్ గెటప్, ఆ సెటప్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే... పవన్ నయా అవతార్ ముందు ప్రేక్షకుల్ని ఆకర్షించిన మరొక క్యారెక్టర్ బాబీ డియోల్ (Bobby Deol As Mughal Emperor)ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. టీజర్ చూస్తే... ఆయన క్యారెక్టర్ క్రూరమైన చక్రవర్తిగా ఉండబోతుందని అర్థం అవుతోంది. టీజర్‌లో 30 సెకన్ల నుంచి 40 సెకన్ల వరకు బాబీ డియోల్ వన్ మ్యాన్ షో రన్ అయ్యింది. ఆయన లుక్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకు ప్రతి విషయంలో విలనిజం కనిపించింది. ఇంకా చెప్పాలంటే... 'యానిమల్' గుర్తుకు వచ్చింది. 
'యానిమల్'లో బాబీ డియోల్ ఒక్క డైలాగ్ చెప్పలేదు. కానీ, కుమ్మేశారు. సేమ్ టు సేమ్... 'హరి హర వీరమల్లు' టీజర్‌లోనూ అంతే! ఒక్క డైలాగ్ లేదు. మూవీలో ఉంటాయో? లేదో? ప్రస్తుతానికి మాత్రం ఆయన క్యారెక్టర్ సూపర్ హిట్ అయ్యింది. 

బాలీవుడ్ మార్కెట్‌లో వీరమల్లుకు ప్లస్సే!
బాబీ డియోల్ క్యారెక్టర్ 'హరి హర వీరమల్లు' సినిమాకు బాలీవుడ్ మార్కెట్, అక్కడి ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంతకు ముందు 'సర్దార్ గబ్బర్ సింగ్'ను హిందీలో విడుదల చేశాడు పవన్. అయితే, ఆశించిన రిజల్ట్ రాలేదు. నిజానికి, అది పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు.

Also Read: అప్పుడు క్రిష్ వర్సెస్ కంగనా... ఇప్పుడు పవన్‌ వర్సెస్ క్రిష్? పవన్‌ను హ్యాండిల్ చేసే సత్తా జ్యోతి కృష్ణకు ఉందా?


'హరి హర వీరమల్లు' అలా కాదు... పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఆల్ ఓవర్ ఇండియా చూసే కాన్సెప్ట్. మొఘల్ చక్రవర్తులను దోచుకునే బందిపోటు అంటే క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాకు బాబీ డియోల్ కూడా ప్లస్సే. ఈ సినిమా 2024లో చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ సీజన్ టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.

'హరి హర వీరమల్లు' మూవీతో పాటు సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ 'కంగువా'లో కూడా బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు.

Also Read'కూలీ'పై ఇళయరాజా గరమ్ గరమ్ - లీగల్ చిక్కుల్లో రజనీకాంత్ సినిమా

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget