RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో టాప్ సీక్రెట్ లీక్ చేసిన బిగ్ బాస్ సోహైల్
RC16 movie update: బిగ్ బాస్ సోహైల్ తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ రివీల్ చేశాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బుచ్చిబాబు సినిమాతో రామ్ చరణ్ బిజీ కానున్నారు. 'RC16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహైల్ కొన్ని ఆసక్తికర అప్డేట్స్ రివీల్ చేసాడు.
'RC16' పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహైల్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 'బూట్ కట్ బాలరాజు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ 'RC16' గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. "బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. ఇండ్రస్ట్రీలో ఆయన నాకు మంచి ఫ్రెండ్. రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను. 'రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు, బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది' అని చెప్పాను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ 'పాన్ ఇండియా కాదు... అది పాన్ వరల్డ్ మూవీ' అని చెప్పారు" అంటూ సోహైల్ అన్నాడు. ఆయన తాజా వ్యాఖ్యలతో 'RC16' పై అంచనాలు తారస్థాయికి చేరాయి.
"PAN WORLD MOVIE" #RC16 🤞
— 𝐉𝐀𝐃𝐇𝐀𝐕 𝐑𝐂 (@Jadhav_8596) February 3, 2024
One More Challenging Character
For our Idol @AlwaysRamCharan
@BuchiBabuSana @vriddhicinemas pic.twitter.com/3P0at4FzBi
మార్చి రెండో వారంలో షూటింగ్.. సరికొత్త మేకోవర్ తో రామ్ చరణ్
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా ప్రాజెక్టు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత 'RC16' నుంచి చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు. రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించేలా RC16 లో చరణ్ రోల్ ని డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
RC16 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే
రామ్ చరణ్ బర్త్ డే రోజు 'RC16' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఆ రోజు ఫ్యాన్స్ కి 'RC 16' ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఈ న్యూస్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'RC16' ప్రాజెక్ట్ ని ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఈ ఏడాది అదే చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తుండటం విశేషం.
Also Read : హీరోగా అజయ్ ఘోష్... యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరితో సినిమా!