By: ABP Desam | Updated at : 13 Sep 2023 10:56 PM (IST)
Image Credit: Star Maa, Disney Hotstar
బిగ్ బాస్ సీజన్ 7లో అస్త్రాల కోసం యుద్ధం మొదలయ్యింది. ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభమయ్యి ఒక వారం కాగా.. మొదటి వారంలో పవర్ అస్త్రాను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి హౌజ్‌మేట్ అయ్యాడు. దీంతో తను రిలాక్స్ అయినా కూడా ఇతర కంటెస్టెంట్స్ మాత్రం పవర్ అస్త్రాను సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో బిగ్ బాస్‌లో ఇక పవర్ అస్త్రా అంకం ముగిసిందని.. ఇప్పుడు మాయాస్త్రం అంకం మొదలయ్యిందని బిగ్ బాస్.. ఒక పిట్టకథ చెప్పి మరీ కంటెస్టెంట్స్‌కు తెలియజేశారు. దీంతో మాయాస్త్రం కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది.
రెండో ఛాలెంజ్‌కు సిద్ధం..
రణధీర, మహాబలి.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఇలా రెండు టీమ్స్‌గా విడిపోయారు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ముందుగా మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రణధీర టీమ్.. మహాబలి టీమ్‌తో పోటీపడి ఒక కీను సాధించింది. మంగళవారం ఎపిసోడ్‌లో ఛాలెంజ్ ఎక్కడ నుంచి ఆగిపోయిందో.. బుధవారం అక్కడ నుండే మొదలయ్యింది. మళ్లీ రణధీర, మహాబలి టీమ్ మధ్య పోరు మొదలయ్యింది. కానీ తాళంచెవిని గెలుచుకోలేకపోయిన మహాబలి టీమ్.. రణధీర టీమ్ దగ్గర నుంచి తాళంచెవిని దొంగలించాలని రాత్రంతా పడుకోకుండా ప్రయత్నాలు చేశారు కానీ అది కుదరలేదు. ఇందుకు శుభశ్రీ, గౌతమ్, దామిని గట్టి ప్లానే వేశారు. రతిక కూడా వారికి సహకరించింది. నిద్రపోతున్న శివాజీ నుంచి ఆ కీ లాక్కోవాలని ప్రయత్నించి విఫలమైంది.
మలుపులో ఉంది గెలుపు..
రణధీర, మహాబలి కలిసి రెండో ఛాలెంజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అదే ‘మలుపులో ఉంది గెలుపు’. ఈ ఛాలెంజ్ ప్రకారం రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తారు. సంచాలకుడిగా వ్యవహరిస్తున్న సందీప్.. ఒక చక్రాన్ని తిప్పుతారు. ఆ చక్రం ఏ చేయి, ఏ కలర్‌పై ఆగుతుందో కంటెస్టెంట్స్ ఆ కలర్‌పై ఆ చేయి లేదా కాలు పెట్టాలి. అలా మూడుసార్లు పోటీ ఉంటుంది. ముందుగా రణధీర్ టీమ్ నుంచి ప్రియాంక, మహాబలి టీమ్ నుంచి గౌతమ్ కృష్ణ పోటీకి దిగారు. అందులో గౌతమ్ కృష్ణ ఓడిపోగా.. రణధీర టీమ్‌కు ఒక పాయింట్ వచ్చింది. ఆ తర్వాత రణధీర నుంచి శోభా శెట్టి, మహాబలి నుంచి పల్లవి ప్రశాంత్ వచ్చారు. పల్లవి ప్రశాంత్ ముందుగా ఓడిపోయినట్టు అనిపించినా.. చివరికి తనే విన్ అయ్యి మహాబలికి మొదటిసారిగా ఒక పాయింట్ సాధించిపెట్టాడు.
రెండు ఛాలెంజ్‌లలో వారే విన్నర్స్..
మలుపులో ఉంది గెలుపు ఛాలెంజ్‌లో రెండు టీమ్స్‌కు రెండు పాయింట్లు వచ్చిన తర్వాత డిసైడింగ్ గేమ్.. యావర్, రతిక మధ్య జరిగింది. రణధీర టీమ్ నుంచి యావర్, మహాబలి టీమ్ నుంచి రతిక రంగంలోకి దిగారు. రతిక చివరి వరకు బాగానే ప్రయత్నించినా ఓడిపోయింది. దీంతో రెండో ఛాలెంజ్‌లో కూడా రణధీర టీమ్ గెలిచింది. దీంతో వారికి రెండో తాళంచెవి కూడా దొరికింది. టేస్టీ తేజ.. తాళంచెవి చూసి ఇచ్చేస్తా అన్నా కూడా తన మీద నమ్మకం లేక రణధీర టీమ్.. ఆ తాళంచెవిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఛాలెంజ్‌లు పూర్తయిన తర్వాత కూడా మహాబలి టీమ్.. రణధీర్ టీమ్ దగ్గర నుంచి తాళంచెవి కాజేయాలనే చూసింది. కానీ చివరి వరకు ఎంత ప్రయత్నించినా అసలు ఆ రెండు కీలు ఎక్కడ ఉన్నాయో తెలియక అయోమయంలో ఉండిపోయింది మహాబలి టీమ్.
Also Read: 'ప్రశాంత్ స్థానంలో శివాజీ ఉంటే ఇలాగే వల్గర్ గా మాట్లాడతారా'? అంటూ ప్రశ్నించిన బిగ్ బాస్ ఫేమ్ అఖిల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!
ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?
Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
/body>