Bigg Boss Divi: నిజాలు తెలుసుకుని ఫోటోస్ వేయండి - మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంపై బిగ్ బాస్ ఫేం దివి రియాక్షన్
Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తోన్న ప్రచారంపై బిగ్ బాస్ ఫేం దివి స్పందించారు. ఆధారాలు లేకుండా తన ఫోటోస్ వాడి తప్పుడు ప్రచారం చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు.

Actor Divi Reaction About Singer Mangli Birthday Party Issue: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీలో విదేశీ మద్యం, గంజాయి వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేశారు. పార్టీకి పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారనే ప్రచారం సాగుతోంది.
స్పందించిన బిగ్ బాస్ ఫేం
ఈ పార్టీకి బిగ్ బాస్ ఫేం దివి అటెండ్ అయ్యారనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా ఆమె దీనిపై స్పందించారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళ్తే.. అక్కడ జరిగే తప్పులకు తననెలా బాధ్యురాలిని చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. 'మీడియా మిత్రులందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్తే అక్కడ జరిగిన మిస్టేక్స్‌ను నాపై వేయడం కరెక్ట్ కాదు. నేను తప్పు చేసినట్లు ఏమైనా ఆధారాలుంటే నా ఫోటో వెయ్యొచ్చు.
కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని మీడియా ఛానళ్లలో నా ఫోటో యూజ్ చేసి నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. ఇది నా కెరీర్‌కు చాలా ఇబ్బంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ బర్త్ డే అని పిలిస్తే వెళ్తారు కదా. మంగ్లీ నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్లాను. అక్కడ జరిగిన సిట్యువేషన్స్‌కు నేను బాధితురాలిలా ఫోటో పెట్టి మరీ ప్రచారం చేయడం తప్పు. మీ ఫ్రెండ్స్ బర్త్ డేకి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన మిస్టేక్స్‌కు మీరు బాధ్యులైపోతారా?' అంటూ దివి ప్రశ్నించారు. అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దని.. ఆధారాలు లేకుండా తన ఫోటోస్ వెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేశారు.
Also Read: ముందుగానే ఓటీటీలోకి హిట్ వెబ్ సిరీస్ 'పంచాయత్ 4' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ టాప్ సింగర్ మంగ్లీ తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ శివారు చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో మంగళవారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. భారీగా గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీకి హాజరైన దాదాపు 48 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అనుమతి లేకుండా విదేశీ మద్యం వాడకం, డీజే ప్లే చేయడం, నిషేధిత గంజాయి సేకరణ వంటి వాటిపై పోలీసులు చర్యలు చేపట్టారు. రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణ, సింగర్ మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ పార్టీకి ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్, బిగ్ బాస్ ఫేం దివి హాజరైనట్లు ప్రచారం సాగింది.
అయితే.. తాను కేక్ కట్ చేసే వరకే ఉన్నానని.. తనపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దని శ్యామ్ తెలిపారు. డ్రగ్స్ వంటి వాటికి తాను దూరమని స్పష్టం చేశారు. తాజాగా.. దివి కూడా ఈ అంశంపై స్పందించారు. ఆధారాలు లేకుండా తన ఫోటోస్ వాడొద్దని, తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.





















