Bigg Boss Aditya Om: బిగ్ బాస్ హౌస్‌లో ఆదిత్య ఓం... దాన్ని క్యాష్ చేసుకుంటూ సైలెంట్‌గా 'బంధి' ప్రమోషన్స్ షురూ
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్స్ లలో ఒకరైన ఆదిత్య ఓం హీరోగా నటించిన మూవీ బంధి. ఈ మూవీ నుంచి తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన విషయాలు రివీల్ అయ్యాయి.
ఇప్పటిదాకా హీరోగా పలు సినిమాలు చేసిన ఆదిత్య ఓం బిగ్ బాస్ సీజన్ 8 లో టెస్టెంట్ గా అడుగు పెట్టిన సంగతికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆదిత్య ఎక్కడా కనిపించట్లేదు గాని, ఆయన సినిమాకు మాత్రం ప్రమోషన్ జరుగుతుంది. అక్కడ బిగ్ బాస్ లో ఆదిత్య బంధీగా ఉంటే, బయట మాత్రం బంధీ సినిమా ప్రమోషన్లు సైలెంట్ గా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీలో హీరో పాత్ర ఏంటి అనే విషయం రివీల్ అయింది.
'బంధీ'లో ఆదిత్య ఓం పాత్ర ఇదే
ఇప్పటిదాకా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య ఓం వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకుని, బంధీ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గల్లి సినిమా అనే బ్యానర్ పై వెంకటేశ్వరరావు, తిరుమల రఘు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తిరుమల రఘు బంధీ మూవీకి దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా, అందులో ఆదిత్య వన్ మాన్ షో చేయబోతున్నాడనే విషయం అందరికీ అర్థమైంది. అయితే ఈ సినిమాలో ఆదిత్య ఓం ప్రకృతిని కాపాడే హీరో పాత్రలో నటిస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయట పెట్టారు.
ఈ మూవీ స్టోరీ, అందులో ఆదిత్య పాత్ర ఏంటంటే... బంధీ మూవీ ట్రైలర్ చూసినవారికి నిజంగా ఒక్క ముక్క కూడా అర్థమయ్యి ఉండదు. ట్రైలర్ లో హీరో తప్ప కనీసం కాకి కూడా కనిపించలేదు. దీంతో మూవీ లవర్స్ కి అసలు ఈ మూవీ ఏంటి? అందులో ఇతను ఒక్కడే కనిపించడం ఏంటి? అనే అనుమానాలు రేకెత్తాయి. వాటికి సమాధానం కావాలంటే బంధి మూవీ స్టోరీని తెలుసుకోవాలి. సినిమాలో ఆదిత్య పాత్ర పేరు ఆదిత్య వర్మ. ఈ వ్యక్తి ప్రకృతిని నాశనం చేస్తున్న కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఈ సినిమాలో నటించారు. సింపుల్ గా చెప్పాలంటే లీగల్ అడ్వైజర్. అయితే ఇలా ప్రకృతిని నాశనం చేసే వారికి అండగా నిలుస్తున్న ఈ లీగల్ అడ్వైజర్ ని చీమలు దూరని చిట్టడవిలో వదిలేస్తే ఎలా సర్వైవ్ అవుతాడు? అసలు అతను అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాలి.
బంధి మూవీని రిలీజ్ చేసేది ఎప్పుడంటే?
ఆదిత్య ఓం నిన్నటి తరం మూవీ లవర్స్ కి తెలిసి ఉండొచ్చు. కానీ తాజాగా ఆయన బిగ్ బాస్ హౌస్ లో కాలు పెట్టడంతో అందరితో పాటే ఇతనెవరా అని అనుకున్నారు. ఒకప్పుడు హీరోగా చేశారు ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం, ధనలక్ష్మి ఐ లవ్ యు వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు. మరి ఈ మూవీని ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చాక రిలీజ్ చేస్తారా ? లేదంటే ఆదిత్య లోపల ఉండగానే బిగ్ బాస్ ను ప్రమోషన్లకు వాడుకుని, మూవీని రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.