Bigg Boss Telugu Season 8 Promo: ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కోసం బొక్క బోర్లా పడ్డ సోనియా... నిఖిల్, పృథ్వీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్, మనీ కోసం కుస్తీ
తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమోలో ప్రైజ్ మనీ కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పృథ్వీ, నిఖిల్ మధ్య ఫైట్ జరిగినట్టు చూపించారు. ప్రోమోలో చూపించిన మరిన్ని విశేషాలపై ఓ లుక్కేద్దాం.
బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు 2వ వారం కాస్త ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఫుడ్ టాస్క్ అంటూ హౌస్ లో అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసిన బిగ్ బాస్ ప్రైజ్ మనీని గెలిచే ఛాన్స్ ఇస్తూ హౌస్ మేట్స్ కు కొన్ని టాస్క్ లు ఇచ్చినట్టు తాజా ప్రోమోలో చూపించారు. అందులో హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నిఖిల్, పృథ్వి మధ్య స్ట్రాంగ్ పోటీ నెలకొంది. మరి ఈ పోటీలో గెలిచేదెవరు? ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో బెస్ట్ ఎవరు? అనేది తేలిపోయే టైం వచ్చేసినట్టుగా కనిపిస్తోంది.
ప్రైజ్ మనీ కోసం ఫిజికల్ అవుతున్న కంటెస్టెంట్స్
తాజా ప్రోమో ప్రకారం బిగ్ బాస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీగా గెలుచుకునే అవకాశాన్ని హౌస్ మేట్స్ కు కల్పించారు. అయితే అందులో భాగంగా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పారు. అందులో భాగంగా ఫస్ట్ బజర్ మోగించి, విష్ణు ప్రియా, మణికంఠ, సోనియాలను స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నారు. అయితే సోనియానే ముందు పరిగెత్తినప్పటికీ కింద పడిపోయింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న విష్ణు ప్రియ గబాల్న పరిగెత్తి స్విమ్మింగ్ పూల్ లో దూకేసింది. మణికంఠ విష్ణు తర్వాత దూకాడు. కాబట్టి ఫస్ట్ టాస్క్ లో విష్ణు ప్రియ విన్ అయింది. ఆమె ఈ టాస్క్ లో 25 వేల ప్రైజ్ మనీని గెలుచుకున్నట్టుగా సమాచారం. ఈ టాస్క్ అయ్యాక సోనియాకు పెద్దగా గాయలేమీ కాలేదన్నట్టుగా చూపించారు. ఆమె ఏడవడంతో అందరూ బుజ్జగించారు. కానీ నిఖిల్ మళ్లీ మొదలుపెట్టాడు. "నేనైతే ఫిజికల్ అవుతాను అని, అదే జరిగితే ఎవరికైనా దెబ్బ తగిలితే ఎలా? మనమందరం ఆర్టిస్టులం" అంటూ చెప్పిందే చెప్పి హౌస్ మేట్స్ కి విసుగు పుట్టించాడు. యశ్మీ అయితే ఎమోషనల్ గా చెప్పిందే చెప్పి మమ్మల్ని కూడా ఆడుకోనివ్వట్లేదు అంటూ నిఖిల్ పై ఫైర్ అయ్యింది. ఆమెపై నిఖిల్ కూడా ప్రోమోలో సీరియస్ అయినట్టుగా చూపించారు. ఇదంతా చూస్తుంటే అందరినీ ఎమోషనల్ గా వీక్ చేసి ఆడడమే నిఖిల్ స్ట్రాటజీ అన్పిస్తోంది.
చిన్నోడి, పెద్దోడి మధ్య కుస్తీ
హౌస్ లో చిన్నోడు పెద్దోడుగా పిలుచుకుంటున్న పృథ్వీ, నిఖిల్ ఎంత క్లోజ్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగా బిగ్ బాస్ వీళ్లిద్దరికి పెద్ద పరీక్ష పెట్టాడు. ఇద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా పోటీ పడాల్సి వచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఇద్దరి మధ్య పోటీ చూడడానికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రోమోలో బిగ్ బాస్ సెకండ్ టాస్క్ పెట్టి అందులో తమ కలర్స్ కు సంబంధించిన బాల్స్ ను తమకు చెందిన బాస్కెట్ లో వేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే పృథ్వీ, నిఖిల్ పోటీ పడాల్సి వచ్చింది. ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో దాదాపుగా ఫిజికల్ అవుతున్నట్టుగా ప్రోమోలో కనిపించింది. ఒకరినొకరు డిఫెండ్ కుస్తీ పోటీని తలపించేలా గొడవపడ్డారని చెప్పాలి. ఇక ఈ టాస్క్ విలువ 50,000 కాగా, ఇందులో ఎవరు గెలిచారు ? అన్నది ఈరోజుటి ఎపిసోడ్లో చూడాలి. కానీ నిఖిల్, పృథ్వీలలో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తేలిపోవడానికి ఇదే బెస్ట్ టైం అని చెప్పొచ్చు.
Read Also: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్