Bholaa Shankar Teaser : భోళా శంకరుడి టీజర్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). దీనికి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకుడు. సుమారు 10 ఏళ్ళ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది. ఆల్రెడీ విడుదల చేసిన పోస్టర్లు, పాటలు చూస్తే స్టైలిష్ ఫిలింగా 'భోళా శంకర్'ను తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతోంది. ఇప్పుడు మెగా అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు.
జూన్ 24న 'భోళా శంకర్' టీజర్!
Bholaa Shankar Teaser Release Date : జూన్ 24న 'భోళా శంకర్' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం నేడు వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిరు స్టిల్ చూస్తే... ఆయన డ్రస్సింగ్ స్టైల్ చాలా స్టైలిష్‌గా ఉంది. లుక్ మాత్రం సీరియస్‌గా ఉంది. టీజర్ ఎలా ఉంటుందో రెండు రోజుల్లో తెలుస్తుంది.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
దేవి శ్రీ విడుదల చేసిన భోళా మేనియా
కొన్ని రోజుల క్రితం సినిమాలో తొలి పాట 'భోళా మేనియా' పాటను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ''మెగాస్టార్ చిరంజీవి గారి 'భోళా శంకర్' చిత్రంలో పాటను విడుదల చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా సోదరుడు మహతి స్వర సాగర్ ఈ పాటతో పెద్ద విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను. తమ్ముడు... జస్ట్ డూ కుమ్ముడు'' అంటూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు మణిశర్మ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు ఆయన తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే 2 లక్షలు అడుగుతావా? సుమన్‌పై శివనాగు ఫైర్
View this post on Instagram
''అదిరే స్టైల్ అయ్యా...
పగిలే స్వాగ్ అయ్యా...
యుఫోరియా నా ఏరియా!
భోళా మేనియా!
ఎగస్ట్రాలు వద్దయ్యా...
కొలెస్ట్రాల్ వద్దయ్యా...
ఎవ్వడైనా గూబ గుయ్యా
భోళా మేనియా'' అంటూ ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. రేవంత్ పాడారు. శేఖర్ మాస్టర్ పాటకు కొరియోగ్రఫీ అందించారు. 'వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా... మనమొస్తేనే స్విచ్ ఆన్ గోల' అంటూ లిరిక్స్ సాగింది.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోస్తున్నారు. కీర్తీ సురేష్ ప్రేమికుడిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ.