అన్వేషించండి

Bholaa Shankar Update : చిరంజీవి 'భోళా శంకర్'లో మన్మథుడి మేనల్లుడు - లవర్ బాయ్ రోల్‌లో... 

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్'. ఇందులో మన్మథుడి మేనల్లుడు నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు నటిస్తున్నారు. అవును, ఈ రోజు ఆ విషయాన్ని వెల్లడించారు.

'భోళా శంకర్'లో సుశాంత్
ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ (Sushanth Anumolu) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

లవర్ బాయ్ తరహా పాత్రలో...
'భోళా శంకర్'లో లవర్ బాయ్ తరహా పాత్రలో సుశాంత్ కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఆమెకు జోడీగా సుశాంత్ కనిపిస్తారేమో!? కొన్ని రోజులు వెయిట్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. 

Also Read : ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా - రామ్ చరణ్

మాస్ మహారాజ రవితేజ 'రావణాసుర'లోనూ సుశాంత్ కీ రోల్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ ఆయన ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఒక వైపు హీరోగా నటిస్తూ... మరో వైపు భారీ బడ్జెట్ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో సుశాంత్ కనిపిస్తున్నారు.  

Also Read : అదొక పాటా? - 'నాటు నాటు'పై కీరవాణి తండ్రి ఘాటు ఘాటు కామెంట్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AK Entertainments (@akentsofficial)

చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఓ మెలోడీ షూట్ చేసినప్పటికీ... విడుదల చేశారు. సినిమాలో ఆ పాటకు కత్తెర వేశారు. తర్వాత కూడా బయటకు రానివ్వడం లేదు. సో... 'భోళా శంకర్'లో ఇద్దరు జంటగా చేసే డ్యాన్స్ ప్రేక్షకులు చూడొచ్చు. త్వరలో తమన్నా షూటింగులో జాయిన్ కానున్నారు.

పవన్ అభిమానిగా చిరు!?
యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించడం వేరు. ఏకంగా మెగాస్టార్ అభిమానిగా కనిపిస్తే? త్వరలో ఆ ఊహ నిజం కానుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 'భోళా శంకర్'లో చిరుది పవన్ ఫ్యాన్ రోల్ అని టాక్. 

'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తారా?
పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించనున్నారని వార్తలు రావడమే ఆలస్యం. 'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తే ఎలా ఉంది? అనే డిస్కషన్ మొదలు అయ్యింది. సోషల్ మీడియాలో ఇప్పుడీ టాపిక్ మీద హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. మరి, ఇందులో నిజమెంత? అనేది చిరు అండ్ కో చెప్పాలి. ఈ సినిమా కోసం చిరంజీవి హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని టాక్. 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ వీణ స్టెప్ పవన్ రీ క్రియేట్ చేశారు. 
  
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరు గుండుతో కనిపించవచ్చు. ఆ మధ్య సోషల్ మీడియాలో గుండు లుక్ పోస్ట్ చేసింది కూడా ఈ సినిమా టెస్టింగ్ లో భాగమే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha :  గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష  - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
Telangana News: వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?
వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha :  గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష  - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
Telangana News: వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?
వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?
Naga Chaitanya: మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
Ksheerannam Recipe : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
Konda Surekha: దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
YS Jagan: యుద్ధానికి సిద్ధం కండి, 4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
యుద్ధానికి సిద్ధం కండి, 4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
Embed widget