Ram Charan - Virat Kohli : ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా - రామ్ చరణ్
Ram Charan Virat Kohli Biopic : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ చేయాలని ఉందని రామ్ చరణ్ తెలిపారు.
మన దేశంలో ఎంటర్టైన్మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రెండు అంటే రెండే! అందులో ఒకటి... సినిమా! రెండోది... క్రికెట్! సినిమాలోకి క్రికెట్ వస్తే... స్టార్ క్రికెటర్ జీవితం ఆధారంగా సినిమా రూపొందితే? అందులోనూ గ్లోబల్ స్టార్ నటిస్తే? ఆ కిక్కే వేరు. అవకాశం రావాలే గానీ ప్రేక్షకులకు అటువంటి కిక్ ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్కొన్నారు.
కోహ్లీ బయోపిక్ చేస్తే...
స్పోర్ట్స్ రోల్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నారు. వెండితెరపై క్రీడాకారుడిగా కనిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మీరు ఏదైనా రోల్ చేయాలని ఉందా? అని అడిగితే... ''చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నా'' అని చెప్పారు చరణ్. విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బావుంటుందని సలహా ఇవ్వగా... ''ఫెంటాస్టిక్. ఛాన్స్ వస్తే చేస్తా. విరాట్ కోహ్లీ ఇన్స్పిరింగ్ రోల్. మా ఇద్దరి గడ్డం కూడా సేమ్ ఉంటుంది'' అని రామ్ చరణ్ చెప్పారు.
గతంలో రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలని ట్రై చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ ధరణితో 'మెరుపు' అని ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి రామ్ చరణ్ మరో స్పోర్ట్స్ సినిమా చేయలేదు. విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉన్నాయని ఆల్రెడీ నెటిజన్లు ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు.
చిరంజీవి... పవన్...
నాకు రెండు కళ్ళు! - రామ్ చరణ్
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ - ఇద్దరిలో ఒకరి పేరు చెప్పమని అడిగితే తనకు ఇద్దరూ రెండు కళ్ళు అని చెప్పారు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి అని, తన తండ్రిని పక్కన పెడితే... సల్మాన్ ఖాన్ ఇష్టం అని సమాధానం ఇచ్చారు రామ్ చరణ్.
ఫేవరెట్ కో స్టార్ కియారా!
'మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు?' అని అడిగితే... కియారా అద్వాణీ పేరు చెప్పారు రామ్ చరణ్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఆమెతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా వాళ్ళిద్దరూ జంటగా నటించారు.
తెలుగు వాళ్ళకు ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు - రామ్ చరణ్
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలుగులోనూ మాట్లాడారు. 'సార్, తెలుగు ప్రేక్షకులకు ఏదైనా ఒక సందేశం ఇవ్వండి' అని అడిగ్గా... ''తెలుగు వాళ్ళకు ఎన్ని చెప్పినా, ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు నాకు. వాళ్ళ వల్లే మా నాన్నగారు గానీ, మేము గానీ ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ ఒక తెలుగు వాడిగా నాకు గర్వంగా ఉంది. వాళ్ళ వల్ల మేము ఈ స్థానంలో ఉన్నాం. జీవితాంతం వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ ఉంటాను'' అని రామ్ చరణ్ తెలిపారు.
Also Read : రామ్ చరణ్‌కు అమిత్ షా సత్కారం - ఇండియన్ సినిమా లెజెండ్ చిరంజీవి అంటూ...