Bholaa Shankar Movie First Look: కొణిదెల 'భోళా' శంకర్ - మహాశివరాత్రికి కొత్త లుక్‌తో వచ్చేసిన మెగాస్టార్
Chiranjeevi First Look From Bholaa Shankar Movie: మహాశివరాత్రి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌తో వచ్చేశారు. 'భోళా శంకర్'గా తన లుక్ చూపించారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అసలు పేరు ఏంటి? కొణిదెల శివ శంకర ప్రసాద్! అందులో శివుడు ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమాల్లో 'భోళా శంకర్' (Bholaa Shankar First Look). ఆ పరమ శివుడిని భోళా శంకరుడు అంటారు కదా! ఆ విధంగా సినిమా పేరులోనూ శివుడు ఉన్నాడు. ఈ రోజు మహాశివరాత్రి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇంత కంటే గొప్ప సందర్భం ఏముంటుంది? అందుకని, 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భోళా శంకర్'. మహాశివరాత్రి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భోళా శంకరుడిగా కొణిదెల శివ శంకర వర ప్రసాద్ లుక్ (Bholaa Shankar Movie First Look) ప్రేక్షకులకు చూపించారు. చేతిలో త్రిశూలంతో కూడిన చైను... జీప్ ముందు కూర్చున్న మెగాస్టార్ ఫోజు... లుక్ స్టయిలిష్ గా ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
View this post on Instagram
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరు చెల్లెలుగా జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్, చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

