Avika Gor Wedding: ఘనంగా హీరోయిన్ అవికా గౌర్ వెడ్డింగ్ - ఫోటోలు వైరల్
Avika Gor: ప్రముఖ హీరోయిన్ అవికా గౌర్ తన ప్రియుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిళింద్ చంద్వానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Avika Gor Wedding Photos: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం అవికా గౌర్ వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిళింద్ చంద్వానీతో ఆమె వివాహం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 'బాలిక నుంచి వధువు వరకూ...' అంటూ పెళ్లి ఫోటోలకు అవికా క్యాప్షన్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆమెకు విషెష్ చెబుతున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
మిళింద్ చద్వానీ ఫేమస్ బిజినెస్ మ్యాన్‌తో పాటు సామాజిక కార్యకర్త. తొలుత ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. ఆ తర్వాత క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవో నెలకొల్పారు. 2019లో ఓ టీవీలో ప్రసారమైన 'రోడీస్ రియల్ హీరోస్' షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం. ఇక కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొన్నేళ్ల క్రితం అవికా, మిళింద్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారి'తో బ్యూటిఫుల్ 'శశిరేఖ' - 'దసరా' స్పెషల్ సర్ ప్రైజ్ కోసం వెయిటింగ్
చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగు వారింట...
2008లో వచ్చిన 'బాలికా వధు' సీరియల్‌తో అవికా గౌర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని తెలుగులో 'చిన్నారి పెళ్లి కూతురు'గా డబ్ చేశారు. అలా తెలుగు టీవీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఆ తర్వాత హిందీ మూవీస్‌తో కన్నడ, తెలుగులోనూ సినిమాలు చేశారు. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె... సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3లోనూ నటించి మెప్పించారు. అవికా లేటెస్ట్ మూవీ 'షణ్ముఖ' ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయ్యింది.
View this post on Instagram





















