అన్వేషించండి

Deepika Padukone: సవాళ్లను స్వీకరించేందుకు రెడీగా ఉంటా - కాంట్రవర్శీలకు చెక్ పెట్టిన దీపికా పదుకోన్

Deepika Padukone Reaction: ఐఎండీబీ లేటెస్ట్ రిపోర్ట్, బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్ అంశం వివాదాలపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు.

Deepika Padukone Reaction On Controversial Issues: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల పలు అంశాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 'కల్కి 2' నుంచి దీపికాను తప్పించడం సహా వర్కింగ్ అవర్స్, కండీషన్స్ విషయంలో ఆమె తీరు వివాదాస్పదమైంది. తాజాగా ఫరాఖాన్ అంశం, ఐఎండీబీ లిస్ట్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు.

ఫరాఖాన్ అంశంపై...

ఫేమస్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్‌ను దీపికా అన్ ఫాలో చేశారన్న వార్తలు రీసెంట్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఫరాఖాన్... సదరు మీడియా కథనాలకు రిప్లై ఇచ్చారు. దీపికా, నేను సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 'మేమిద్దరం బర్త్ డే విషెష్ కూడా పంచుకోం. అలాంటివి దీపికకు నచ్చవు. చిన్న చిన్న విషయాలు కూడా కాంట్రవర్శీ చెయ్యొద్దు.' అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ కామెంట్స్‌పై స్పందించిన దీపికా పదుకోన్... ఫరాఖాన్ చెప్పిన విషయాలే తాను కూడా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. తథాస్తూ... అంటూ చేతులు జోడించిన ఎమోజీలను పోస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే?

రీసెంట్‌గా ఓ టీవీ షోలో పాల్గొన్న ఫరాఖాన్... 'ఆమె ఇప్పుడు పని చేసేది 8 గంటలే. ఈ షోకు వచ్చేంత టైం ఎక్కడిది?.' అంటూ కామెంట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను దీపికా అన్ ఫాలో చేశారనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఫరాఖాన్ సైతం దీపికా, రణ్‌వీర్ ఇద్దరినీ అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇది ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ అటు ఫరాఖాన్ ఇటు దీపికా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక వీరిద్దరి కాంబోలో 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.

సవాళ్లకు సిద్ధంగా ఉంటా

సవాళ్లకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపికా తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. 'నా కెరీర్‌లో నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. సవాళ్లను స్వీకరించడంలో భయపడలేదు. వాటికీ ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. క్వశ్చన్ చేసేందుకు వెనుకాడను. నా ఫ్యామిలీ, ఫ్యాన్స్ సపోర్ట్, ప్రేమాభిమానాలే నాకు విమర్శలను ఎదుర్కొనే శక్తి ఇచ్చాయి.' అంటూ చెప్పారు.

ఇక ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా 26 ఏళ్ల సినిమాలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో దీపికా నటించిన చిత్రాలే 10 ఉన్నాయి. దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ నివేదిక తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు.

Also Read: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ప్రభాస్ 'కల్కి 2' మూవీ నుంచి దీపికా పదుకోన్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తప్పించింది. అంతకు ముందు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ నుంచి కూడా ఆమెను తప్పించడంతో హాట్ టాపిక్‌గా మారింది. వర్క్ అవర్స్, కండీషిన్స్ విషయంలో దీపికా పట్టుబట్టడంతోనే ఆమెను తప్పించారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ప్రత్యక్షంగా స్పందించకపోయినా ఇటీవల ఇన్ స్టాలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Razor OTT : రెండు ఓటీటీల్లో రవిబాబు వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో రవిబాబు వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
Kotha Malupu : ఓటీటీలోకి సింగర్ సునీత కొడుకు కొత్త మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సింగర్ సునీత కొడుకు కొత్త మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Satluj OTT : రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్
ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Embed widget