Tejeswini Nandamuri Mathukumilli: అప్పుడు బాలకృష్ణ కుమారుడి సినిమా... ఇప్పుడు కుమార్తె సినిమా... ఇద్దరికీ సేమ్ సీన్ రిపీట్!
Balakrishna Legacy Movies: ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ చిత్రసీమలో అడుగుపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసులు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వాయిదాల పర్వం కొనసాగుతోంది.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ అడుగు పెట్టారు. తండ్రికి తగ్గ వారసుడిగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లెగసీని నిలబెట్టినది బాలయ్య అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు అందరిలో కంటే ఇండస్ట్రీలో విజయవంతమైన ట్రాక్ రికార్డు బాలయ్యది. ఇప్పుడు ఆయన సంతానం సినిమాల్లోకి రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే... అందుకు సరైన సమయం, సందర్భం, ముహూర్తం కుదరడం లేదు. వాయిదాల పర్వం కొనసాగుతోంది.
హీరోగా నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా వాయిదా!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తొలి సినిమా ఇంకా మొదలు కాలేదు. చివరి వరకు వచ్చి వాయిదా పడింది. నందమూరి అభిమానులు పదేళ్లుగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఏదైనా ఉందంటే... మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా కోసం.
Also Read: Balakrishna Taluka: బాలకృష్ణ తాలూకా ఎవరు? 'అఖండ 2'కు అండగా నిలబడేది ఎవరు?
'లెజెండ్'లో బాలకృష్ణ నడిపిన బండి మీద మోక్షజ్ఞ దిగిన ఫోటోలు అభిమానులకు విపరీతంగా నచ్చాయి. ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూపులు అలాగే ఉన్నాయి. ఒకానొక దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం పలువురి దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఒక సందర్భంలో 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' అనౌన్స్ చేసిన బాలకృష్ణ, ఆ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తారని చెప్పారు. అవన్నీ పక్కకు వెళ్లి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. రేపు మూవీ ఓపెనింగ్ అనగా రాత్రికి రాత్రి సినిమా క్యాన్సిల్ చేశారు. కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. మరొక మంచి ముహూర్తంలో తనయుడిని పరిచయం చేస్తామని బాలకృష్ణ తెలిపారు.
నిర్మాతగా ఎం తేజస్విని నందమూరి సినిమా వాయిదా!
తమ్ముడు మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా పరిచయం కాబోయే సినిమాతో అక్క ఎం తేజస్విని నందమూరి నిర్మాతగా పరిచయం కావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ తేజ కలయికలో సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత అయితే... ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలు. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?
మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఆగిన తర్వాత మళ్ళీ 'అఖండ 2 తాండవం' పోస్టర్ మీద ఎం తేజస్విని నందమూరి పేరు పడింది. తండ్రి బాలకృష్ణ హీరోగా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన సినిమాకూ తేజస్విని సమర్పకురాలు. అయితే ఈ సినిమా కూడా అనూహ్యంగా విడుదలకు ఒక్క రోజు ముందు వాయిదా పడింది. ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుందనే క్లారిటీ లేదు.
యాదృశ్చికం లేదా కాకతాళీయం లేదా మరొక కావచ్చు... రేపు ఓపెనింగ్ అనగా కొన్ని గంటల ముందు, ఒక్క రాత్రి ముందు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా క్యాన్సిల్ అయ్యింది. కొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడతాయని చూస్తుండగా నిర్మాత / చిత్ర సమర్పకురాలిగా ఎం తేజస్విని నందమూరి మొదటి సినిమా 'అఖండ 2' రిలీజ్ క్యాన్సిల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ పిల్లల ఇద్దరికీ వాయిదాల గండం ఎదురైంది. ఇండస్ట్రీలో మొదటి అడుగు పడటం కొంచెం లేట్ అవ్వొచ్చు కానీ పడటం మాత్రం పక్కా. బ్యాడ్ సెంటిమెంట్ అని అభిమానులు బాధ పడాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ, తేజస్విని త్వరలో ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. మోక్షజ్ఞ సినిమా మొదలు కావడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. ఆల్రెడీ 'అన్ స్టాపబుల్' షోతో ఓటీటీలో సక్సెస్ కొట్టిన తేజస్విని, త్వరలో విడుదల కాబోయే 'అఖండ 2'తో వెండితెరపై కూడా సక్సెస్ కొడతారు. సో... నందమూరి ఫ్యాన్స్ కొంచెం ఒప్పిగ్గా ఇంకొంచెం టైం వెయిట్ చేయండి.





















