Balakrishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్... NBK109 టైటిల్ టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత
NBK109 Release Date: నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ఎన్.బి.కె109 సినిమా టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడు నాగ వంశీ తెలిపారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు అందరికీ ఒక గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా బాబి కొల్లి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదల తేదీని విజయ దశమి కానుకగా వెల్లడించనున్నారు. ఇంకా టైటిల్ టీజర్ రిలీజ్ ఎప్పుడో కూడా తెలిపారు.
దీపావళికి టైటిల్ టీజర్ విడుదల!
NBK 109 Title Tease Release On Diwali 2024: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఫోటో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోగోలో కనబడుతుంది. ఆయన అంటే నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి అభిమానం. నందమూరి కుటుంబం అన్నా, ఆ హీరోలు అన్నా సరే అంతే అభిమానం. 'దేవర' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ఆయన విడుదల చేశారు. బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నారు.
#NBK109 దీపావళి కి టైటిల్, టీజర్..
— Sailendra Medarametla (@sailendramedar2) October 11, 2024
రేపు రిలీజ్ డేట్ ప్రకటిస్తాం - @vamsi84 #NandamuriBalaKrishna pic.twitter.com/J6QaY3FbDx
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు ఈరోజు లక్కీ భాస్కర్ సినిమా విలేకరుల సమావేశంలో నాగవంశీ తెలిపారు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
విజయదశమి కానుకగా విడుదల తేదీ!
NBK 109 Release Date: టైటిల్ టీజర్ విడుదల కంటే ముందు ఎన్.బి.కె 109 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకువచ్చేది చెప్పనున్నారు. విజయ దశమి కానుకగా... అంటే ఈ శనివారం (అక్టోబర్ 12న) విడుదల తేదీని వెల్లడిస్తామని నాగ వంశీ చెప్పారు.
Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి!
బాలకృష్ణ సరసన ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు. నాని జెర్సీ సినిమాతో పాటు వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఒక కథానాయిక కాగా... నార్త్ ఇండియన్ బ్యూటీ ఊర్వశి రౌతేల మరొక హీరోయిన్. ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబి డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం యస్.యస్. తమన్ మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలతో పాటు ఆసక్తి నెలకొంది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

