అన్వేషించండి

Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!

Allari Naresh Birthday: హీరో అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ఇవాళ 'బచ్చల మల్లి' సినిమా టీమ్ స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆయన మాస్ రోల్ మామూలుగా లేదు.

యువ కథానాయకులలో ఎటువంటి క్యారెక్టర్, కథలోనైనా నటించగల ప్రతిభ ఉన్న తెలుగు నటుల్లో అల్లరి నరేష్ (Allari Naresh) ఒకరు. ఆయన విలక్షణ నటుడు. ఒక సమయంలో ఆయన పేరు చెబితే కేవలం కామెడీ క్యారెక్టర్లు గుర్తుకు వచ్చేవి. కానీ, 'గమ్యం', 'శంభో శివ శంభో' వంటి సినిమాలూ చేశారు. మధ్య మధ్యలో వెరైటీ రోల్స్ చేసినా ఎక్కువ ఫన్నీ ఫిలిమ్స్ చేశారు. ఇటీవల ఆయన కథలు, సినిమాల ఎంపికలో వెర్సటాలిటీ చూపిస్తున్నారు. 'అల్లరి' నరేష్ మరో ఇంటెన్స్ రోల్ చేస్తున్న సినిమా 'బచ్చల మల్లి'. ఆయన పుట్టిన రోజు (Allari Naresh Birthday) కానుకగా ఈ రోజు మూవీ స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. 

సోలో బ్రతుకే దర్శకుడితో అల్లరి నరేష్...
సాయి దుర్గా తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా ఫేమ్ సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi) దర్శకత్వంలో 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్ ఫిల్మ్ 'బచ్చల మల్లి' (Bachhala Malli Movie). 'సామజవరగమన', 'ఊరు పేరు భైరవకోన' వంటి విజయవంతమైన సినిమాలు అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న చిత్రమిది. నరేష్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎవడి కోసం తగ్గాలి... ఎందుకు తగ్గాలి!
'బచ్చల మల్లి' వీడియో గ్లింప్స్ చూస్తే... ఫస్ట్ సర్‌ప్రైజ్ చేసే విషయం 'అల్లరి' నరేశ్ మాస్ అండ్ ఇంటెన్స్ అవతార్. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్కులో మాసీగా ఆయన కనిపించారు. అయితే... అంతకు మించి మాస్ ఇప్పుడీ వీడియోలో ఉంది.

Also Read: 'కల్కి 2898 ఏడీ' హిందీ డిజిటల్ రైట్స్‌లో ట్విస్ట్ - రెండు ఓటీటీల్లో Prabhas సినిమా!

''దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు... సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు... రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడు'' అని నేపథ్యంలో ఘంటసాల మాటలు వినిపిస్తుంటే... ఒక పల్లెటూరిలో బంగాళా పెంకుటిల్లు నుంచి బయటకు వస్తున్న హీరోని పరిచయం చేశారు. ఆ తర్వాత బ్రాందీ షాపు దగ్గర బాటిల్ నుంచి గ్లాసులోకి వెరైటీ మందు పోస్తూ తాగడం మామూలు మాసీగా లేదు. ఇక 'ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి' అని నరేష్ చెప్పే డైలాగ్ హైలైట్ అసలు.

Also Read'కల్కి 2898 ఏడీ' రివ్యూ: సినిమా విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా? ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?


Bachhala Malli Movie Cast And Crew Details: ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా 'బచ్చల మల్లి'ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'అల్లరి' నరేష్ సరసన 'హనుమాన్' ఫేమ్ అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, 'బలగం' జయరామ్, హరి తేజ, ప్రవీణ్, హర్ష చెముడు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: 'సీతా రామం' ఫేమ్ విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: 'మానాడు', 'రంగం', 'మట్టి కుస్తీ' సినిమాల ఫేమ్ రిచర్డ్ ఎం నాథన్, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు, ఎడిషనల్  స్క్రీన్ ప్లే: విశ్వ నేత్ర, నిర్మాతలు: రాజేష్ దండ - బాలాజీ గుత్తా, కథ - మాటలు - దర్శకత్వం: సుబ్బు మంగాదేవి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget