‘రెడ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.. అమృత అయ్యర్. ఇంతకు ముందే ఆమె విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రంతో పరిచయమైంది. ‘రెడ్’ తర్వాత ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ చిత్రంలో నటించింది. ఆమె నటించిన మూడు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం అమృత పాన్ ఇండియా చిత్రం ‘హనుమాన్’లో నటిస్తోంది. మరో తెలుగు, తమిళ చిత్రానికి కూడా అమృత సంతకం చేసింది. తాజాగా అమృత కాఫీతో స్నానం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఓ ‘కాఫీ బాడీ వాష్’ను ప్రమోట్ చేస్తూ అమృత ఈ ఫొటో పెట్టింది. Images Credit: Amritha Aiyer/Instagram