నటి మధుశాలిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మధుశాలిని, గోకుల్‌ల పెళ్లి బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పెళ్లికి కొంతమంది సినీ ప్రముఖులే హాజరయ్యారు. తమిళ చిత్రం ‘పంచాక్షరం’లో మధుశాలిని, గోకుల్ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. మధుశాలిని 2018లో విడుదలైన ‘గూడచారి’ సినిమాలో కనిపించింది. ఇటీవల రిలీజైన ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌లో తారకరత్నకు భార్య పాత్రలో కనిపించింది. మధుశాలిని పెళ్లికి హాజరైన నటరాజ్ మాస్టార్ Images and Video Credit: Madhu Shalini/Instagram