జూన్ 18 శనివారం రాశిపలాలు



మేషం
ఉద్యోగం మారాలి అనుకున్నవారికి మంచి చేస్తాడు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రెండ్, ఆరెంజ్ మీకు కలిసొచ్చే రంగులు.



వృషభం
ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఈ రోజు శుభప్రదం. నిన్నటి వరకూ నష్టపోయిన వ్యాపారులు ఈ రోజు పుంజుకుంటారు.విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. గ్రీన్, బ్లూ మీకు కలిసొచ్చే రంగులు.



మిథునం
ఉద్యోగం మారాలి అనుకుంటే ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం బాగా సాగుతుంది..కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి మంచి సమయం. బ్లూ, గ్రీన్ మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.



కర్కాటకం
ఈ రోజు మీకు ఉదయం కన్నా సాయంత్రం సమయం అనుకూల ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. రెడ్, గ్రీన్ మీకు కలిసొచ్చే రంగులు. అవకాశం ఉంటే అన్నదానం చేయండి.



సింహం
కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రాంత ప్రయాణం చేయాలి అనుకునేవారు ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఎల్లో, ఆరెంజ్ మీకు కలిసొచ్చే రంగులు.



కన్యా
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ శుభసమయమే. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఆంజనేయుడికి ఈ రోజు ఎర్రటి పూలతో పూజచేస్తే మీకున్న ఇతర గ్రహదోషాలు తొలగిపోతాయి.మీకు కలిసొచ్చే రంగులు వయొలెట్, బ్లూ



తుల
నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రోమోషన్ వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా మాట్లాడొద్దు..ఎవ్వరి మాటల్లోనూ ఇన్వాల్వ్ కావొద్దు. తల్లిదండ్రుల సహకారం రెండూ మీకుంటుంది. తెలుపు,ఊదా రంగులు మంచివి.



వృశ్చికం
మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృహస్పతి శుభస్థానంలో ఉండటం వల్ల రాజకీయ నాయకులకు విజయవంతమైన రోజు. స్నేహితుల నుంచి మీకు సహకారం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రెడ్, ఎల్లో మీకు కలిసొచ్చే రంగులు.



ధనుస్సు
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. భోజనాన్ని నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. గ్రీన్, బ్లూ మీకు కలిసొచ్చే రంగులు.



మకరం
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. రాజకీయాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగం మార్పు విషయంపై గందరగోళానికి గురవుతారు. ఇంట్లో వాతావరణంలో కూడా చిన్న చిన్న చికాకులుంటాయి. గ్రీన్,వయొలెట్ మీకు కలిసొచ్చే రంగులు.



కుంభం
ఈ రాశి ఉద్యోగులు పనిని ఎంజాయ్ చేస్తారు. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభమవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు హనుమంతుడిని పూజిస్తే మంచిది. గ్రీన్, స్కై బ్లూ మీకు శుభప్రదమైన రంగులు.



మీనం
మీన రాశివారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఉద్యోగులకు శుభసమయం. ఎల్లో, రెడ్ మీకు కలిసొచ్చే రంగులు.