ఉప్పు చేతికివ్వకూడదు అంటారెందుకు!

ఇంట్లో నిత్యవసరాల్లో ఒకటైన ఉప్పును కుటుంబ సభ్యులు కూడా ఒకరి చేతికి మరొకరు అందించరు.

ఉప్పు చేతికి అందిస్తే ఏమవుతుందని అడిగినా కొందరు శని పడుతుంది అంటారు. మరికొందరు ఏమో..ఇంట్లో పెద్దోళ్లు చెప్పారని పాటిస్తున్నాం అంటారు

ఉప్పు చేతికిస్తే ఆ ఇద్దరి మధ్యా బంధం, ప్రేమ, స్నేహం ఏదైనా కానీ బలహీనమవుతుందంటారు పండితులు

శ్లో. గో భూ తిల హిర‌ణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ‌
రౌప్యం ల‌వ‌ణ మిత్యాహుర్ధ‌శ‌దానాః ప్ర‌కీర్తితాః

శ్లోకానికి అర్థం ఏంటంటే....

ఉప్పు ద‌శ‌దానాల్లో ఒక‌టి, పితృ కార్యాల‌లో, శ‌ని దానాల‌్లో ఉప్పు దానం ఇస్తుంటారు. అంటే అశుభాన్ని గుర్తు చేసే విషయం కనుక ఉప్పు చేతికి ఇవ్వకూడదంటారు పెద్దలు.

ఉప్పందించడం అనే సామెత కూడా దీన్నుంచే వచ్చింది. అంటే చేయకూడని పని చేయడం అని అర్థం.

సైంటిఫిక్ రీజన్ చూస్తే...ఉప్పును ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వినియోగించేవారు. ప్ర‌స్తుతం ప్రాశ్చాత్య దేశాల్లో ఉప్పు థెర‌పీ కూడా చేస్తున్నారు. స‌ముద్రం స్నానం అన్నింటికంటే ఉత్త‌మమైనది అని చెప్పడం వెనుక కూడా కారణం ఇదే.

ఎక్కువుగా ఒత్తిడికి గురైన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేసి అందులో అరికాళ్లు మునిగేలా కాసేపు ఉంచితే ఒత్తిడి దూరమవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటుందన్నమాట.

ఉప్పు ఒకరి చేతినుంచి మరొకరు తీసుకున్నప్పుడు... ఇచ్చిన వారి శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తీసుకున్న వారికి చేరుతుందంటారు.
Images Credit: Pinterest