Baa Baa Black Sheep Movie: బా బా బ్లాక్ షీప్... పాన్ ఇండియా సినిమాల్లో నటులతో కొత్త క్రైమ్ కామెడీ
'సాహో', 'సలార్', 'యానిమల్' వంటి పాన్ ఇండియా హిట్ సినిమాల్లో నటించిన ఆర్టిస్టులతో చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి ఓ సినిమా నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో', 'సలార్'తో బాలీవుడ్ యాక్టర్ టినూ ఆనంద్ (Tinnu Anand) మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో బాలకృష్ణ 'ఆదిత్య 369', చిరంజీవి 'అంజి'లోనూ నటించారు. అయితే... 'సలార్' టీజర్‌లోని డైనోసార్ డైలాగ్ ఆయన్ను పాపులర్ చేసింది. ఆయనతో పాటు 'సలార్'లో వరదరాజ మన్నార్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కార్తికేయ దేవ్, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే ప్రధాన పాత్రల్లో చిత్రాలయం స్టూడియోస్ పతాకం మీద వేణు దోనేపూడి ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
బా బా బ్లాక్ షీప్... ఒక్క రోజులో జరిగే కథ!
టిను ఆనంద్, ఉపేంద్ర లిమయే, కార్తీ 'ఖైదీ' ఫేమ్ జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ దేవ్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న చిత్రానికి 'బా బా బ్లాక్ షీప్' టైటిల్ ఖరారు చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
గన్స్, గోల్డ్ నేపథ్యంలో 'బా బా బ్లాక్ షీప్' సినిమాను తెరకెక్కించామని దర్శకుడు గుణి మంచికంటి తెలిపారు. ఒక్క రోజులో జరిగే ఘటనల సమాహారమే కథ అని ఆయన వివరించారు. ఇదొక న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ అని, ఆరుగురు చేసే ప్రయాణంలో ముగ్గురు ఎటువంటి తెలివితేటలు చూపించారు? అనేది సినిమాలో చూడాలని ఆయన అన్నారు. ప్రయాణంలో ఆరుగురికి ఎదురయ్యే పరిణామాలు నవ్విస్తాయన్నారు.
Also Read: 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?
Baa Baa Black Sheep Movie Cast And Crew: టిను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, కార్తికేయ దేవ్, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: చిత్రాలయం స్టూడియోస్, నిర్మాత: వేణు దోనెపూడి, సహ నిర్మాత: కొండల్ జిన్నా, దర్శకత్వం: గుణి మంచికంటి, సంగీతం: స్టీఫెన్, ఆనంద్, కళా దర్శకుడు: సాహి సురేష్, కూర్పు: విజయ్ ముక్తవరపు, ఛాయాగ్రహణం: అజయ్ అబ్రహం జార్జ్.





















