అన్వేషించండి

Love Me Trailer: రోజు సరిగ్గా 8 గంటలకు అలారం మోగుతుంది, దెయ్యంతో హీరో రొమాన్స్‌, - ఆసక్తి పెంచుతున్న 'లవ్‌ మీ' ట్రైలర్‌

Love Me Trailer: యంగ్‌ హీరో అశీష్‌, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'లవ్ మీ' మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. పూర్తి హారర్‌ అండ్‌ రొమాంటిక్‌ అంశాలతో రిలీజైన ట్రైలర్‌ ఆసక్తిని పెంచుతుంది.

Love Trailer Out: నిర్మాత దిల్‌ రాజు నటవారసుడిగా ఆయన సోదరుడు శీరిష్‌ ఇంటి నుంచి ఆశిష్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. రౌడీ బాయ్స్‌ మూవీతో ఆశీష్‌ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు నటిస్తున్న చిత్రం 'లవ్‌ మీ'. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం హారర్‌ అండ్‌ రొమాంటి లవ్ డ్రామాగా రూపొందింది. దర్శకుడు అరుణ్ భీమవరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి  లవ్‌ మీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తరుణంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. పూర్తిగా హారర్‌ అంశాలతో విడుదలైన ఈ ట్రైలర్‌ ఆద్యాంతంగా ఆసక్తిని పెంచుతుంది. క్షణక్షణంగా ఉత్కంఠ సాగిన ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. డార్క థీమ్‌లో కొత్త జంట శోభనం రాత్రి సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. అప్పడే బ్యాగ్రౌండ్‌లో రోజూ రాత్రి సరిగ్గా 8 గంటలకు ఓ అలారం మొగుతుంది అంటూ  ఆసక్తిని పెంచారు. కొత్త పెళ్లి కూతురు తలుపు తెరిచి చూసి ఆమె షాక్‌ అవుతుంది. అదేంటో ఎవరైనా నన్ను ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలి అనిపిస్తుంది. అక్కడ డేంజర్‌ ఉంది.. అటూ వెళ్లోద్దు అంటే అటే వెళ్లాలి అనిపిస్తుంది అని హీరో చెప్పే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఇదే హీరోని రిస్క్‌లో పడేస్తుందని అర్థమైపోతుంది. ఆ తర్వాత ట్రైలర్‌ మొత్తం ఓ పాడు బడ్డ ఇంటి చూట్టు తిరుగుతుంది. హేయ్‌ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకే తెలుసే.. బయటకు రావే నువ్వు అంటూ హీరో అనగానే చీకట్లోని నుంచి ఓ మహిళా రూపం బయటకు వస్తుంది. ఈ సీన్‌ ట్రైలర్‌ హైలెట్‌గా నిలిచింది.

మే 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

‘లవ్ మీ’ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం కారణంగా వాయిదా పడింది. మే 25, 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా హారర్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఓ యువకుడు దెయ్యాన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనేదే సినిమా కాన్సెప్ట్ ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత అందించారు. ఇప్పటికే ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల కాగా.. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఒక పాటను ఏఐ టెక్నాలజీ ద్వారా పాడించడం ఓ విశేషం. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ వంటి స్టార్ సినిమాటోగ్రాఫర్‌ వర్క్ చేయడం మరో ప్రత్యేకత.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Avengers Doomsday Promo : అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget