అన్వేషించండి

Miss Shetty MR Polishetty Movie : ఆగస్టు నుంచి సెప్టెంబర్‌కు అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల సినిమా?

అనుష్క అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ పాటికి థియేటర్లలోకి రావాల్సిన సినిమా. అయితే... వాయిదా పడింది. మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుందని టాక్. 

తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) అభిమానులు తమ ఆరాధ్య కథానాయికను వెండితెరపై చూడటానికి మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. నిజం చెప్పాలంటే... అనుష్క సినిమా విడుదలై ఈ రోజుకు వారం అవ్వాలి. అయితే... పరిస్థితులు అనుకూలించక వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై సందిగ్ధం నెలకొంది.   

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల వాయిదా!
యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). తొలుత ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ తేదీన సినిమా విడుదల చేయడం లేదని, త్వరలో కొత్త విడుదల తేదీతో పాటు ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేదీ చెబుతామని కొన్ని రోజుల క్రితం చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తెలియజేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేయక తప్పలేదని పేర్కొంది. 

సెప్టెంబర్ 7న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'!?
Miss Shetty Mr Polishetty New Release Date: ఆగస్టు 4 నుంచి చిత్రాన్ని వాయిదా వేశామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల కావచ్చని వినిపించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ రోజు విడుదల కావడం కూడా కష్టమని ఫిల్మ్ నగర్ ఖబర్. సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.

Also Read : 'జైలర్' సినిమా రివ్యూ : రజనీకాంత్ సినిమా హిట్టా? ఫట్టా?

అనుష్క సినిమా థియేటర్లలో వచ్చి ఐదేళ్ళు అవుతోంది. 'భాగమతి' 2018లో వస్తే... ఆ తర్వాత ఆమె నటించిన 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో అతిథి పాత్రలో కనిపించారంతే! సో, అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'జాతి రత్నాలు' విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా కోసం కూడా కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు యువి క్రియేషన్స్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. 

Also Read 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు .పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.

'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget