అన్వేషించండి

Happy Birthday Anjali: అచ్చమైన తెలుగందం అంజలి బర్త్‌డే - ఇండస్ట్రీలో ఈ రాజోల్‌ అమ్మాయి రూటే సపరేటు..

Anjali Birthday Today: నేడు హీరోయిన్‌ అంజలి బర్త్‌డే. హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లు చూసిన అంజలిని వెంటాడిన పలు వివాదాలు. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Happy Birthday Anjali: హీరోయిన్‌ అంజలికి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అచ్చమైన తెలుగు అందం అంటూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. వెండితెరపై సహాజమైన నటనతో పక్కింటి అమ్మాయిల అనిపిస్తుంది. ఎలాంటి పాత్రైనా ఒదిగిపోయి నటిస్తుంది.  కామెడీ, సీరియస్‌, ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలాంటి జానర్‌ అయినా తన యాక్టింగ్‌తో ఇమిడి పోతుంది. తెలుగు హీరోయిన్‌ అయినా సౌత్‌లోని అన్ని భాషల్లో నటించి స్టార్‌ నటి మంచి గుర్తింపు పొందింది. షాపింగ్‌ మాల్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, జర్నీ వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అంజలి సినీ, వ్యక్తిగత జీవితం గురించి చూద్దాం.

రాజోల్ లో పుట్టి చెన్నైకి

ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా రాజోల్‌లో  1986 జూన్ 16న జన్మించింది అంజలి. ఆమె అసలు పేరు బాల త్రిపుర సుందరి. పదోవ తరగతి వరకు రాజోల్‌లోనే చదివిన అంజల ఆ తర్వాత చెన్నైలో డిగ్రీ పూర్తి చేసింది. తన తండ్రి ఉద్యోగరిత్యా చెన్నైకి వెళ్లడంతో అక్కడే సెటిలయ్యారు. చిన్నప్పటి నటనపై ఆసక్తి ఉన్న అంజలికి తన కుటుంబం చెన్నై వెళ్లడం ఆమెకు ప్లస్‌ అయ్యింది. అక్కడ డిగ్రీ చదువుతూనే ఆమె పలు షార్ట్‌ ఫలింస్‌లో నటించి సినీరంగం వైపు అడుగులు వేసింది. అలా హీరోయిన్‌ అవ్వాలనే తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకుంది. ఆమె నటించిన షార్ట్‌ ఫిలిం మంచి గుర్తింపు పొందింది. దీంతో అతి తక్కువ టైంలోనే తమిళం సినిమాలో చాన్స్‌ కొట్టేసింది.

వెండితెర ఆరంగేట్రం ఇలా

"కాట్రాదు తమిళ్" అనే తమిళ్‌ సినిమాలో హీరో జీవా సరసన హీరోయిన్‌గా నటించి వెండితెరపై ఆరంగేట్రం చేసింది. ఇదే సినిమా తెలుగులో 'డేర్‌' పేరుతో డబ్‌ అయ్యింది. ఆ తర్వాత అంజల్‌ 'ఫోటో'(2006) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ వెంటనే 'ప్రేమలేక రాశా' అనే సినిమా చేసింది. కానీ అంజలి ఇవేవి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఆమె నటించిన షాపింగ్‌ మాల్‌ తమిళ్‌ డబ్బింగ్‌ మూవీతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రం హిట్ కావడంతో‌ అంజలి దర్శక-నిర్మాతల దృష్టిలో పడింది. షాపింగ్‌ మాల్‌లో అంజలి నటనకు ఫిదా అయినా మురుగదాస్‌ తన 'జర్నీ' సినిమాకు హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసి తీసుకున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో అంజలి ఆ వెంటనే తెలుగులో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"లో(2013) వెంకటేష్‌కు జంట నటించింది. ఇందులో సీత పాత్రలో చలాకీ అమ్మాయిగా తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని మెప్పించింది.ఆ తర్వాత రవితేజ 'బలుపు' సినిమాలో తన ఎమోషన్‌ పండించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత 2014 సస్పెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ గీతాంజలి ద్విపాత్రాభినయం చేసింది. ఈ సినిమాలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత అంజలిని పలు వివాదాలు చూట్టుముట్టాయి. కిడ్నాప్ గురైంది కొన్ని రోజులు ఆజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పుట్లో ఈ న్యూస్‌ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా అయ్యింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. కొంతకాలం పాటు వెండితెరపై ఆమె కనిపించలేదు. కొన్నేళ్ల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ 'వకీల్‌ సాబ్‌' చిత్రంలో ఓ కీలక పాత్రలో  కనిపించింది. ఆ తర్వాత ఇటీవల 'గీతాంజలి 2','గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె త్వరలో రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతుంది. అలా కెరీర్‌లో ఒక్కసారిగా సక్సెస్‌ చూసిన అంజలిని సడెన్‌గా వివాదాలు చూట్టుముట్టాయి. అలా వెండితెరపై దూరమై లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఆమె కెరీర్‌ సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగాలి ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే అంజలి. 

అవార్డులు 

ఈ తెలుగమ్మాయి అంజలి యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపై సహాజంగా నటిస్తూ ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అంతేకాదు ఆమె నటనకు ప్రశంసగా ఎన్నో ఆవార్డులు వరించాయి. తన డెబ్యూ చిత్రం "కాట్రాదు త‌మిళ్" మూవీలో తన సహాజ సిద్దమైన నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలాగే ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత నటించిన నటించిన 'అంగడి తెరు' అనే మరో తమిళ సినిమాకు కూడా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డు వరించింది. తెలుగులో ఆమె నటించి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు చిత్రాలకు గానూ ప్రతిష్టాత్మక నంది అవార్డును కైవసం చేసుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget