Anand Mahindra: 'కల్కి 2898 AD' బుజ్జిని కలుసుకున్న ఆనంద్ మహీంద్రా - ఆకట్టుకుంటున్న వీడియో
Bujji Meets Anand Mahindra: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహింద్రా కల్కి బుజ్జిని కలిశారు. ఆనంద్ మహింద్రా టీం ఆధ్వర్యంలోనే ఈ రోబోటిక్ వాహనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.
Bijji Meets Anand Mahindra: ట్రైలర్‌తో 'కల్కి'(Kalki 2898 AD)మేనియా మొదలైంది. పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'కల్కి 2898 AD' ఒకటి. సైన్స్ ఫిక్షన్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్ మరింత క్యూరియాసిటి పెంచుతున్నాయి. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. భైరవ, బుజ్జి పరిచయంతో 'కల్కి' ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నాగ్ అశ్విన్. ఇక బుజ్జి, భైరవ ఇంట్రడక్షన్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బుజ్జి పాత్ర కీలకమనే విషయం తెలిసిందే.
Anand Mahindra Meets Bujji: తాజాగా బుజ్జిని వ్యాపార దిగ్గజం, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) కలిశారు. ఈ సందర్భంగా బుజ్జిని ఆయన డ్రైవ్ చేశారు. ఈ వీడియోను తాజాగా మూవీ టీం షేర్ చేసింది. బుజ్జిని కలిసిన ఆనంద్ మహీంద్రా అంటూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేస్తూ వీడియో షేర్ చేసింది.కాగా టైం ట్రావెలర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ రోబోటిక్ వాహనాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కల్కి టీం ఆనంద్ మహీంద్రా టీంతో టై అప్ అయ్యింది. మహింద్రా గ్రూప్‌కు చెందని రీసెర్ట్ వ్యాలిలో ప్రత్యేకంగా ఈ వాహనాన్ని తయరు చేశారు.
చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఆనంద్ మహింద్రాకు చెందిన టీం, కల్కి టీం కలిసి అత్యాధునికి సాంకేతికతతో ఈ రోబోటిక్ వాహనాన్ని తయారు చేశారు. దీనికి బుజ్జీ అని పేరుతో వెండితెరపై పరిచయం చేయబోతున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు బుజ్జిని కలిసి ఆనంద్ మహీంద్రా కాసేపు వాహనాన్ని పరీక్షించారు. కాసేపు దీనిపై డ్రైవ్ చేస్తూ మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆయన "బుజ్జి వల్ల భవిష్యత్‌లో రోబో వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చేలా కల్కి టీం సహాయపడింది" అంటూ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించినట్టు మూవీ టీం పేర్కొంది. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహింద్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/4VQCe3hSSv
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 12, 2024
కాగా కల్కి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇండియన్ మూవీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్లు నుంచి రూ.600 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు టాక్. ఇక వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విన్ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశ పటాని వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శోభనలు అతిథి పాత్రలో నటిస్తున్నారని టాక్.
Also Read: ఆ వ్యక్తితో క్లోజ్‌గా సురేఖ వాణి - ముంబై పార్టీలో నటి సందడి , ఫోటో వైరల్