అన్వేషించండి

Baby Poster: ఛీ ఛీ, అంత దిగజారుతారా? ‘బేబీ’ రిలీజ్ డేట్ పోస్టర్‌పై నెటిజన్స్ ఆగ్రహం

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేబీ'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గత ఏడాది 'పుష్పక విమానం', 'హైవే' వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఈ హీరో 'బేబీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడిగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ నిర్మాత SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ గా ఈ సినిమాని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

జూలై 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అన్ని బాగానే ఉన్నా తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు ఓ వివాదంగా మారేలా ఉంది. అందుకు కారణం.. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో మిడిల్ ఫింగర్ లో హీరోయిన్‌ను పెడుతూ లుక్ డిజైన్ చేయడమే. ఈ పోస్టర్లో ఒక చేయి. ఆ చేయి మిడిల్ ఫింగర్ గా హీరోయిన్ వైష్ణవి చైతన్యాన్ని చూపించారు. పింక్ కలర్ డ్రెస్ లో ఆమె నవ్వుతూ కనిపించింది. అయితే అమ్మాయిని అలా మిడిల్ ఫింగర్ గా చూపించడం ఏంటి? అంటూ ఈ పోస్టర్ చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఈ పోస్టర్ ను చూస్తుంటే కథ ఏదో కొత్తగా ఉండేలా ఉంది అని చెబుతున్నారు.
Baby Poster: ఛీ ఛీ, అంత దిగజారుతారా? ‘బేబీ’ రిలీజ్ డేట్ పోస్టర్‌పై నెటిజన్స్ ఆగ్రహం

మొత్తం మీద 'బేబీ' మూవీ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియా అంతటా వివాదాస్పదంగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమాపై ఏదో విధంగా ఆసక్తిని క్రియేట్ చేసేలా చేశారు మేకర్స్. అయితే, ఈ పోస్టర్ వివాదంగా మారడంతో డిలీట్ చేయక తప్పలేదు. దాని స్థానంలో మరో పోెస్టర్‌ను పోస్ట్ చేశారు. అయితే, చిత్రయూనిట్ కావాలనే పబ్లిసిటీ కోసం ఆ పని చేసి ఉంటారని నెటిజన్స్ అంటున్నారు. కాగా ఈ సినిమాపై నిర్మాత SKN తాజాగా ట్వీట్ చేశారు. " బేబీ ఫస్ట్ కాపీ చూశాను. ఈ సినిమాను నేను నిర్మించినందుకు ఎంతో ఆనందంగానూ.. గర్వంగా.. ఫీల్ అవుతున్నాను. దయచేసి అందరూ మా సినిమాని సపోర్ట్ చేయండి" అంటూ పేర్కొన్నారు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య డిగ్లామరస్ రోల్ లో నటించింది. 'సాఫ్ట్వేర్ డెవలపర్' తో పాటు మరికొన్ని యూట్యూబ్ సిరీస్ లతో ఎంతో పాపులారిటీని తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ మూవీ తోనే హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ సినిమా హీరోయిన్ గా వైష్ణవి చైతన్యకి అలాగే హీరోగా ఆనంద్ దేవరకొండ కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Also Read : 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget