News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'భగవంత్ కేసరి' లో ఊర మాస్ సాంగ్ - ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ప్లాన్ చేశారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్లో ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే 'అఖండ' సినిమా కంటే ముందు బాలయ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల మార్క్ అందుకున్న దాఖలాలే లేవు. కానీ 'అఖండ' సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ. ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ తర్వాత ఆ క్రేజ్ బాలయ్యకే సొంతమైంది. ఇక ప్రస్తుతం బాలయ్య కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటిని పెంచాయి. ఎంతలా అంటే విడుదలకు ముందే ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ విని బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఓ ఊర మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఊర మాస్ సాంగ్లో బాలయ్యతో కలిసి కాజల్, శ్రీ లీల అదిరిపోయే స్టెప్స్ వేయనున్నారట. అంతేకాదు ఇప్పటివరకు వచ్చిన మాస్ సాంగ్స్ ని కొట్టే విధంగా ఈ పాటను కంపోజ్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మాస్ సాంగ్ లో 'దంచవే మేనత్త కూతురా' బిట్ ను సైతం యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో మాస్ సాంగ్.. దానికి తోడు కాజల్, శ్రీ లీలతో బాలయ్య మాస్ డాన్స్ అంటే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు. కాగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా.. ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తెలంగాణ నేటివిటీతో తండ్రీ కూతుర్ల బాండింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల బాలయ్య కి కూతురిగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ఐతే సినిమాకి హైలెట్ గా ఉంటాయట. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మొత్తంలో కూడా ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా ఉంటాయని అంటున్నారు. మరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యకి 'భగవంత్ కేసరి' ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Also Read : తండ్రి సైఫ్‌ను అరెస్ట్ చేసిన కూతురు సారా అలీ ఖాన్ - ఇదేం మాస్ యాడ్ మామా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Jul 2023 05:04 PM (IST) Tags: Balakrishna Kajal Agarwal Anil Ravipudi Sreeleela Bagavanth Kesari Bagavanth Kesari Movie

ఇవి కూడా చూడండి

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND Vs AUS, Match Highlights:  మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి