By: ABP Desam | Updated at : 28 Mar 2023 03:38 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Amrita Rao/Instagram
టాలీవుడ్ లో కేవలం కొన్ని సినిమాలే చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో అమృత రావు ఒకరు. అయితే అమృత తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘అతిథి’ సినిమా. ఈ మూవీలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. అందరి లాగే ఈమె కూడా సినిమా కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అయితే ఆమె పడిన కష్టాలను, చేదు అనుభవాలను కలపి ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ అనే పుస్తకాన్ని రాసింది. అందులో సినిమా రంగంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంది. తన మేనేజర్ చేసిన పని వలన తాను ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టు పుస్తకంలో రాసుకొచ్చింది అమృత.
ఆ అవకాశం మిస్ అవ్వడానికి గల కారణాన్ని చెప్పింది. అమృత రావు మహేష్ బాబుతో ‘అతిథి’ సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్ లో ఉందట. ఆ సమయంలో ఓ రోజు తాను హోటల్ లో ఉండగా బోణీ కపూర్ వద్ద పనిచేసే ఓ వ్యక్తి తనను గుర్తుపట్టి తన దగ్గరకు వచ్చి మాట్లాడాడని చెప్పింది అమృత. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. మీ డేట్లు అడ్జెస్ట్ అయి ఉంటే మీరు సల్మాన్ ‘వాంటెడ్’ సినిమాలో భాగం అయ్యేవారని అన్నాడట. దీంతో అమృతకు మైండ్ బ్లాక్ అయిపోందట. ‘‘సల్మాన్ సినిమాలోకి నన్నెప్పుడు అడిగారు’’ అని అడిగిందట అమృత. ‘‘అదేంటీ, మీ మేనేజర్ మీకు చెప్పలేదా. మేము ఫోన్ చేసి అడిగితే డేట్స్ అడ్జెస్ట్ అవ్వవు అని చెప్పాడు’’ అని చెప్పాడట ఆ వ్యక్తి. దీంతో అమృతకు గుండె పగలినంత పనైందట.
ఆ వ్యక్తి అలా చెప్పేసరికి తను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం వస్తే తానెందుకు నో చెప్తాను అని ఆవేదన వ్యక్తం చేసింది అమృత. తర్వాత వెంటనే తన మేనేజర్ ను పనిలో నుంచి తీసేసిందట. ఈ విషయాన్ని తన ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ పుస్తకంలో రాసుకొచ్చింది. ఏదేమైనా తన మేనేజర్ చేసిన పని తనను జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేసిందని చెప్పుకొచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’ సినిమా 2014 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాకు రిమేక్. ఈ మూవీకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ఆయేషా టకియా హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన అమృత హిందీలో పలు హిట్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ 2014లో తన ప్రియుడు అన్మోల్ ని వివాహం చేసుకుంది. ఆన్మోల్ ఒక రేడియో జాకీ. దాదాపు ఏడేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి కూడా రహస్యంగానే జరిగింది. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత పెళ్లి గురించి బయటపెట్టిందీ జంట. అమృత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
Also Read : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
Sulochana Passes Away: బాలీవుడ్లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Byjus Loan Default: బైజూస్‌కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?