ప్రభాస్ 'కల్కి' పై అమితాబ్ పోస్ట్ - మరోసారి ఆ రూమర్స్‌కి చెక్!
Kalki2898AD : ప్రభాస్ 'కల్కి' మూవీ గురించి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Amitabh Bachchan Shares A Major Update On Prabhas 'Kalki 2898 AD' : 'సలార్' వంటి సక్సెస్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీ పెంచాయి. ఇందులో బాలీవుడ్ భామలు దీపికా పడుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. విశ్వ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వేసవి కానుకగా మే 9న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడం మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో మరోసారి కలిపి రిలీజ్ పోస్ట్ పోన్ కావడం గ్యారెంటీ అనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా మూవీ టీం కల్కి వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇప్పుడు తాజాగా అభితాబ్ బచ్చన్ కూాాడా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 'కల్కి' షూటింగ్ తో పాటూ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
'కల్కి 2898AD' పై అమితాబ్ పోస్ట్
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తాజాగా తన బ్లాగ్ లో 'కల్కి' సినిమా గురించి ఇలా రాసుకోచ్చారు." కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్ళీ ఆలస్యమైంది. ఈ సినిమా చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయిపోయాయి. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారం మే 9న సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులకు ఓ మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు" అంటూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
వచ్చే నెలలోనే ట్రైలర్
'కల్కి2898AD' మూవీ ట్రైలర్ ని సినిమా రిలీజ్ సరిగ్గా నెల రోజులు ఉందనంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వచ్చే నెల 9వ తేదీన 'కల్కి' ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రైలర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పబోతున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ సైతం ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
22 భాషల్లో 'కల్కి' రిలీజ్
'కల్కి'' సినిమాని మేకర్స్ పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈ విషయంపై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వరల్డ్ వైడ్ గా అత్యధిక భాషలో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా 'కల్కి2898AD' నిలవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ 'కల్కి2898AD' సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ప్రభాస్ 'కల్కి 2898'లో 'హనుమాన్' హీరో - ఏ పాత్రలో అంటే?