Amitabh Bachchan: అమితాబ్ ‘ట్రాజిడీ’ ట్వీట్ - రన్న్ ఉత్సవానికి ఆహ్వానిస్తూ ఓదార్పు తెలిపిన మోదీ
తాజాగా అమితాబ్ బచ్చన్ బాధతో చేసిన ఒక ట్వీట్‌కు నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఆయనను రన్న్ ఉత్సవానికి ఆహ్వానిస్తూ ఓదార్పు తెలిపారు.
రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీలతో ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారు. కలిసి సమయాన్ని కూడా కేటాయిస్తారు. నరేంద్ర మోదీ సైతం చాలామంది సినీ సెలబ్రిటీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ను మెయింటేయిన్ చేస్తారు. తాజాగా నరేంద్ర మోదీ ఫోటోను తన ట్విటర్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతే కాకుండా దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ క్యాప్షన్‌కు మోదీ సమాధానమిచ్చారు. అలా వారిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక సంభాషణ సాగింది. ఈ సంభాషణలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను రన్ ఉత్సవ్‌కు రమ్మని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించారు.
అదే ట్రాజిడీ..
ఇటీవల నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరాఖండ్‌లోని జోలింగ్కాంగ్‌లో ఉన్న ఆదికైలాశ్ పర్వతంతో పాటు పార్వతి కుంధ్‌ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు మోదీ. అయితే ఈ ఫోటోలను అమితాబ్ షేర్ చేస్తూ.. ‘‘ట్రాజిడీ ఏంటంటే నేను ఎప్పటికీ వీటిని నేరుగా చూడలేను’’ అని వాపోయారు. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ మోదీ కంటపడింది. దీంతో ఆయనకు ఒక సలహాతో రిప్లై ఇచ్చారు ప్రధాని.
T 4799 - The religiosity .. the mystery .. the divinity of Kailash Parbat , has been intriguing me for long .. and the tragedy is that I shall never be able to visit it in person .. pic.twitter.com/x5xe7ZAXaB
— Amitabh Bachchan (@SrBachchan) October 14, 2023
సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం..
‘‘పార్వతి కుంధ్, జగదేశ్వర్ దేవాలయాలను సందర్శించడం చాలా అద్భుతంగా అనిపించింది. రానున్న వారాల్లో రన్న్ ఉత్సవ్ ప్రారంభం కానుంది. అందుకే మీరు కచ్‌కు రావాలని కోరుకుంటున్నాను. మీరు స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించడం కూడా బాకీ ఉంది’’ అంటూ అమితాబ్ బచ్చన్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు మోదీ. మరి మోదీ ఇచ్చిన ఈ ఓపెన్ ఆహ్వానాన్ని మన్నించి అమితాబ్ రన్న్ ఉత్సవానికి వెళ్తారేమో చూడాలి.
My visit to Parvati Kund and Jageshwar Temples was truly mesmerising.
— Narendra Modi (@narendramodi) October 15, 2023
In the coming weeks, Rann Utsav is starting and I would urge you to visit Kutch. Your visit to Statue of Unity is also due. https://t.co/VRyRRy3YZ8
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ..
ఇటీవల బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్.. తన 81వ ఏట అడుగుపెట్టారు. దీంతో తన ఫ్యాన్స్ అంతా కలిసి సోషల్ మీడియాలను అమితాబ్ ఫోటోలతో, విషెస్‌తో, తన సినిమా పోస్టర్లతో, పాటలతో నింపేశారు. ఇప్పటికీ సీనియర్ నటుడిగా అమితాబ్ బచ్చన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక గత కొన్నేళ్లలో అమితాబ్.. తెలుగులో ఎక్కువగా నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహరెడ్డి’లో ఒక కీలక పాత్రలో కనిపించారు బిగ్ బి. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్ బి బర్త్‌డే సందర్భంగా ‘కల్కి’ నుండి ఆయన లుక్ విడుదల కాగా.. మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ఇక తెలుగులో ‘కల్కి’తో బిజీగా ఉన్న అమితాబ్.. హిందీలో ‘గణపత్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా.. అమితాబ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ‘గణపత్’ టీజర్‌లో అమితాబ్ రోల్ సినిమాకు ప్రాణంగా నిలవనుందని అర్థమవుతోంది. ఇక ఈ టీజర్ కూడా అమితాబ్ వాయిస్ ఓవర్‌తోనే ప్రారంభం కావడం విశేషం. 81 ఏళ్ల వయసులో కూడా ఇలా బాలీవుడ్ బిగ్ బి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం తన ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.
Also Read: మెగా బ్లాక్ బస్టర్ 'శంకర్ దాదా MBBS' రీ రిలీజ్ - ఫ్యాన్స్ రెడీనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial