Niharika Konidela : నిహారిక షాకింగ్ నిర్ణయం - ఆ ఒక్కటీ తప్పా, పెళ్లి ఫోటోలన్నీ డిలీట్?
గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్య విడాకుల వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చైతన్య పెళ్లి కి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారు. ఇదే క్రమంలో తాజాగా నిహారిక కూడా..
సినిమా రంగంలో సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి వారి వ్యాఖ్యలు, చేసే పనులు చర్చనీయాంశమవుతుంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలు, పెళ్లిల్ల గురించి ఎక్కువగా పుకార్లు వస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే నిజం అవుతాయి. మరికొన్ని పుకార్లుగానే మిగిలిపోతాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. నిహారిక-వెంకట చైతన్యకు 2020 డిసెంబర్ లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలసి పలు టీవీ ప్రోగ్రామ్ లలో కూడా కనిపించారు. అయితే ఏమైందో తెలియదుగానీ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నిహారిక-చైతన్య విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఇటీవలే చైతన్య కూడా వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దీంతో వీరు విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే తాజాగా నిహారిక సైతం పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్య విడాకుల వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చైతన్య పెళ్లి కి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారు. అలాగే నిహారిక ను కూడా అన్ ఫాలో చేశారు. ఇదే క్రమంలో తాజాగా నిహారిక కూడా తన పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేసేసింది. అందులో ఒక్కటి కూడా తన భర్తకు సంబంధించిన పోస్ట్ లేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని నెటిజన్స్ అంటున్నారు. ఇటీవల సెలబ్రెటీలు అంతా ఇలాగే విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్నారు. గతంలో శ్రీజ, సమంత వంటి వారు కూడా ఇలాగే తమ విడాకుల విషయాలను ఇండైరెక్ట్ గా చెప్పారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం, ఇన్స్టా లోని పేర్లు మార్చడం వంటివి చేస్తూ హింట్ ఇచ్చారు. తాజాగా నిహారిక కూడా అలాగే చేయడంతో నిజంగా వాళ్లు విడాకులు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నిహారిక ఇన్‌స్టాలో కేవలం నోటి మీద వేలు వేసుకుని ‘‘ష్..ష్..’’ అంటున్న ఫొటో ఒక్కటే ఉంది.
నిహారిక-చైతన్య ల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఐదు రోజుల పాటు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. వీరి పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి వార్త దేశమంతా వినిపించింది. అంత అట్టహాసంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్ ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపా దడపా సినిమాలు చేసిన నిహారిక పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫేంట్ బ్యానర్ లో ‘నాన్న కుచ్చి’, ‘మ్యాడ్ హౌస్’ వంటి సిరీస్ లను తీసింది. అయితే ప్రస్తుతం నిహారిక విడాకుల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటి వరకూ నిహారిక గానీ, మెగా ఫ్యామిలీ గానీ స్పందించలేదు. మరి దీనిపై వారు ఎప్పుడు, ఎలా స్పందిస్తారో చూడాలి.