Ambika Rao Passed Away: గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి
Ambika Rao Died Of Heart Attack: మలయాళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి అంబికా రావు మృతి చెందారు.
మలయాళ నటి, సహాయ దర్శకురాలు అంబికా రావు (Ambika Rao) ఇకలేరు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో గల ఒక ప్రయివేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో మరణించినట్టు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే...
అంబికా రావు వయసు 58 సంవత్సరాలు. చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. మధ్యలో కరోనా వచ్చింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అంబిక మృతి చెందినట్టు సమాచారం.
బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన 'కృష్ణ గోపాలకృష్ణ' సినిమాతో అంబికా రావు కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలు. ఆ తర్వాత నటిగా మారారు. మలయాళ సినిమా 'కుంబలంగి నైట్స్'లో హీరోయిన్ తల్లి పాత్ర చేశారు. ఆ సినిమా ఆమెకు చాలా పేరు తెచ్చింది. అల్లు అర్జున్ 'పుష్ప : ది రైజ్'లో పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, కమల్ హాసన్ 'విక్రమ్'లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్ ఆ సినిమాలో హీరో.
Also Read : ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా
పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులు అంబికా రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
View this post on Instagram