అన్వేషించండి

Amala Paul: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే - పొట్టి డ్రెస్‌లో అందాల ఆరబోతపై అమలా పాల్ కామెంట్స్

హీరోయిన్ అమలా పాల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ధరించిన డ్రెస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై తాజాగా ఆమె స్పందించింది. తప్పు తనది కాదు, ఫోటోలు తీసిన వాళ్లదని చెప్పుకొచ్చింది.

Amala Paul Responds To Criticism Against Inappropriate Outfit: మలయాళీ హీరోయిన్ అమలా పాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె పలు సినిమాలు చేసింది. చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘లెవెల్ క్రాస్’ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అందులో భాగంగానే రీసెంట్ గా కేరళలోని ఎర్నాకులంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ కు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆమె దుస్తులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. విద్యా సంస్థలలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్‌కు కాస్త పద్దతిగా వెళ్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పొట్టి దుస్తుల్లో వెళ్లి విద్యార్థులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ లో జరిగే కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు పద్దతిగా ఉండాలంటూ అమలాపాల్ ను విమర్శిస్తున్నారు.  

విమర్శలపై స్పందించిన అమలా పాల్

తన డ్రెస్ మీద వస్తున్న విమర్శలపై తాజాగా అమలా పాల్ స్పందించింది. ఆ డ్రెస్ లో తాను చాలా కంఫర్ట్ గా ఉన్నట్లు వెల్లడించింది. “కాలేజీలో జరిగి ఈవెంట్ లో నేను ధరించిన డ్రెస్ నాకు చాలా సౌకర్యంగా ఉంది. అలాంటి దుస్తులలో ఆ ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదు. నిజానికి నా దుస్తుల కంటే, ఆ ఫోటోలు తీసిన వారిదే అసలు సమస్య. వారు నా ఫోటోలు ఎలా తీశారు అనేది చర్చ జరగాల్సిన అంశం. ఆ దుస్తులలో నన్ను చూడటం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదు. నేను మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తాను. కాలేజీకి నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్లడం వెనక ఉద్దేశం విద్యార్ధులలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే” అని వివరించింది.   

View this post on Instagram
 
A post shared by Amala Paul (@amalapaul)

గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్

ఇక అమలా పాల్ పర్సనల్ విషయానికి వస్తే, గత నెలలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ ని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫామ్ చేసింది. తాజాగా ఆమె నటించిన ‘లెవెల్ క్రాస్‌’ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీగా అంచనాలు పెంచుతున్నది. అమలా పాల్ చివరిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడు జీవితం’ మూవీలో కనిపించింది. మార్చి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ‘లెవెల్ క్రాస్’తో సహా మరో మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది.

Also Read: ‘డెడ్‌పూల్ 3’ టీజర్: మార్వెల్‌కు మహారాజు తానేనట - ‘వోల్వరైన్‌’తో పెట్టుకున్నాడు, ఏమైపోతాడో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget