అందాల భామ అమలా పాల్ తన హాట్ సెల్ఫీ ఫోజులతో నెట్టింట నిప్పు రాజేసింది. టాప్ యాంగిల్ లో ఎద అందాలను చూపిస్తూ, టెంప్టింగ్ లుక్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. బ్లాక్ గ్లాసెస్ ధరించి, ముక్కుకు ముక్కెర పెట్టుకొని డిఫరెంట్ గా కనిపిస్తోందీ హాట్ బ్యూటీ. 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్.. 'నాయక్' 'ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాలతో అలరించింది. 'ప్రేమ ఖైదీ' 'లవ్ ఫెయిల్యూర్' 'మేము' 'ఆమె' వంటి డబ్బింగ్ సినిమాలతో పలకరించింది. తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని లాంటి స్టార్ హీరోలతో నటించినా.. 'స్టార్ హీరోయిన్'గా మారలేకపోయింది. టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోవడంతో, అమ్మడు తమిళ మళయాల ఇండస్ట్రీలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అమలా పాల్ చివరగా 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ మలయాళీ బ్యూటీ.. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.