ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అలరించిన సదా.. ఇప్పుడు బుల్లితెరపై మెరుస్తోంది. పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పలు లేటెస్ట్ ఫొటో షూట్లతో సందడి చేస్తోంది. ఇంతకు ముందు ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా చేసిన సదా. ఇప్పుడు నీతోనే డ్యాన్స్ లో జడ్జిగా చేస్తోంది. తాజాగా ఈ షో సెట్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ లెహెంగాలో బ్యూటీఫుల్ స్మైల్ తో కనువిందు చేసింది. ఈ ట్రెండీ లుక్ లో సదా మరింత అందంగా కనిపిస్తోంది. Image Credits : Sadaa/Instagram