కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తోనే అట్రాక్ట్ చేసే హీరోయిన్లలో శివాత్మిక రాజశేఖర్ ఒకరు. అందంతో, హావభావాలతో ప్రేక్షకుల్ని ఇట్టే కట్టి పడేస్తుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. శివాత్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా 'దళపతి'లోని 'సుందరి కన్నల్ ఒరు సేతి..' సాంగ్ లో మెరిసిన చిన్నది. చెట్ల పచ్చదనం మద్యంలో ముదురు గ్రీన్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ తో ఆకట్టుకుంది. కైపెక్కించే లుక్స్ తో మైమరిపించింది. శివాత్మిక ఇటీవల కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగ మార్తండ'లో నటించింది. Image Credits: Shivatmika Rajashekar/Instagram