సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తన సరికొత్త ఫొటోలతో నెట్టింట నిప్పురాజేసింది. ట్రెడిషనల్ అండ్ కాంటెంపరరీ వర్క్ కలబోసిన డిజైనింగ్ వస్త్రాల్లో అమ్మడు మెరిసిపోతోంది. ఫ్యాషన్ డిజైనర్ రాజేష్ ప్రతాప్ సింగ్ దుస్తులను ధరించడం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది మృణాల్. మెల్బోర్న్ ఒక డ్రీమ్ అని, రాజేష్ ప్రతాప్ డిజైన్ చేసిన దుస్తులు దాన్ని ఫాంటసీలాగా మార్చేసాయని అంటోంది. మృణాల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె కైపెక్కించే చూపులు, మత్తెక్కించే అందాలు యువ హృదయాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్.. 'లవ్ సోనియా' 'సూపర్ 30' 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'సీతారామం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం 'హాయ్ నాన్న' చిత్రంలో నేచురల్ స్టార్ నానికి జోడీగా నటిస్తోంది మృణాల్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.