Allu Sirish: అల్లు ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ - ఆ రోజున అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్... ఆయనకు కాబోయే భార్య ఎవరంటే?
Allu Sirish Marriage: యంగ్ హీరో అల్లు శిరీష్ గుడ్ న్యూస్ చెప్పారు. నయనిక అనే అమ్మాయితో ఈ నెల 31న తన ఎంగేజ్మెంట్ జరగనుందని ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు.

Allu Sirish Is Getting Engaged Soon: అల్లు ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్మెంట్ ఈ నెల 31న జరగనుందని చెప్పారు. తనకు కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'బుధవారం మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా నా మనసుకు సంబంధించి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నా. నయనికతో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇటీవల మరణించిన మా అమ్మమ్మ నా వివాహం చూడాలని ఎప్పుడూ కోరుకునేది. ఆమె మాతో లేకపోయినా, మేము కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఆమె పై నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు. మా కుటుంబాలు మా ప్రేమను ఎంతో ఆనందంతో స్వీకరించాయి.' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా... నెటిజన్లు, అభిమానులు విషెష్ చెబుతున్నారు.
View this post on Instagram

Also Read: ఘనంగా హీరోయిన్ అవికా గౌర్ వెడ్డింగ్ - ఫోటోలు వైరల్
అల్లు శిరీష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ కుమార్తెతో ఆయన వివాహం జరగబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా... నయనికతో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు అల్లు శిరీషే స్వయంగా అనౌన్స్ చేశారు.
అల్లు శిరీష్ 'గౌరవం' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాక కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబీసీడీ, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో మూవీస్‌లో నటించి మెప్పించారు. గతేడాది 'బడ్డీ' మూవీలో నటించారు. ఆ తర్వాత ఏ మూవీస్ చేయలేదు. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన అటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తాజాగా తన ఎంగేజ్మెంట్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. దీంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






















