Allu Arjun’s Pushpa 2 : వామ్మో.. ‘పుష్ప 2’లో గంగమ్మ జాతర సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? 5 చిన్న సినిమాలు తియొచ్చేమో!
Pushpa 2 : 'పుష్ప - 2' ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ అయితే.. తెగ ఆకట్టుకుంటోంది. ఆ టీజర్ లో కనిపించిన గంగమ్మ జాతర సీన్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట.
Allu Arjun’s Pushpa 2 Gangamma Thalli jatara scene: అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్న సినిమా 'పుష్ప - 2 ద రూల్'. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే 'పుష్ప'తో క్రేజ్ పెంచుకున్నాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దీంతో ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు, ఆ మానియాను కొనసాగించేందుకు చిత్ర బృందం తెగ కష్టపడుతోంది. ఇక ఈ మధ్య రిలీజైన టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంట్లో అల్లు అర్జున్ చీర కట్టుకుని, ఆభరణాలు వేసుకుని గంగమ జాతరలో మాతంగి వేషంలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఆ జాతర సీన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది.
ఆరు నిమిషాల సీన్2కు ఎన్నికోట్లు అంటే?
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా 'పుష్ప-2' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాంట్లో అల్లు అర్జున్ గెటప్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆయన మేకప్, యాక్టింగ్ గుస్ బంప్స్ తెప్పించాయి. తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో ఉంది ఆ సీన్. అయితే, ఆ ఒక్క సీన్ షూట్ చేసేందుకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టిందంట చిత్ర బృందం. ప్రతి ఒక్కటి డీటైల్డ్ గా ఎక్కడా ఏ తేడా రాకుండా చేశారట. ఇక గంగమ్మ జాతర సీన్ ఆరు నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది.
షూటింగ్‌కు 30 రోజులు..
తిరుపతిలో గంగమ్మ జాతర చాలా ప్రత్యేకం ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ తేడా రాకుండా అన్ని కరెక్ట్ గా ఉండేలా సీన్ ని తీశారట. ఇక ఈ ఆరు నిమిషాల సీన్ తీసేందుకు 30 రోజులు పట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి ఈ సీన్ తీసేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పటీకీ షూటింగ్ చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించలేదు. కానీ, ఆ సినిమాతో అసోసియేట్ అయిన ఒక వ్యక్తి మాత్రం.. దీనిపై స్పందించారు. “అది భారీ బడ్జెట్ సీన్ అని మాత్రమే చెప్పగలను. మేళాను కరెక్ట్ గా చూపించాలంటే కచ్చితంగా భారీ సెట్ వేయాలి. దాని కోసం మేకర్స్ చాలా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే సినిమాకు ఆయువుపట్టు ఆ సీన్ కాబట్టి. ఇక అల్లుఅర్జున్ కి బ్యాక్ పెయిన్ వచ్చినా సీన్స్ కంప్లీట్ చేశారు” అని ఆ వ్యక్తి చెప్పారు.
ఓటీటీ రైట్స్ లాక్..
'పుష్ప - 2 ది రైజ్' సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. టీజర్ తర్వాత విపరీతమైన హైప్ కూడా క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా కోసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయట. 'పుష్ప' సినిమాని అమెజాన్ ప్రైమ్ రూ.30 కోట్లకు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం పార్ట్ - 2 ని నెట్ ఫ్లిక్స్ లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ కి అమెజాన్ ఇచ్చిన అమౌంట్ కంటే మూడు రెట్లు అదనంగా చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రూ.100 కోట్లకు సినిమాని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందనే వార్తలు వినిపిస్తుండగా.. చిత్ర బృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫాహద్ ఫైసిల్, జగపతి బాబు, బ్రహ్మాజీ, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. 'పుష్ప ది రైజ్'.. 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు 'ది రూల్'.. ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Also Read: నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ