Allu Arjun New Movie : 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా - మెంటల్ మాస్ కాంబినేషన్
Sandeep Reddy Vanga to direct Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఈ రోజు ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు.
మాస్... మెంటల్ మాస్ కాంబినేషన్ అంటే ఇదేనేమో!? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమాను ఈ రోజు ప్రకటించారు. తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్'... ఒకే కథతో రెండు సార్లు భారీ విజయాలు అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శివ చందన సహ నిర్మాత. 'ఆర్య 2'లో స్టార్టింగ్ సీన్స్ కావచ్చు... 'పుష్ప'లో పుష్పరాజ్ క్యారెక్టర్ కావచ్చు... రా అండ్ రస్టిక్ అంటే అల్లు అర్జున్ చెలరేగిపోయారు. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండను, 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్‌ను సందీప్ రెడ్డి వంగా ఎలా చూపించారో తెలుసు. క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా సినిమా కోసం ఎంత మాసీగా మారతారనేది చూడాలి.
అల్లు అర్జున్ చేతిలో రెండు...
ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2 Movie) చిత్రీకరణ చేస్తున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో కూడా 'పుష్ప' విజయం సాధించడం, ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సీక్వెల్ క్రేజ్ పెరిగింది. దాని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న సినిమా చేయనున్నారు. ఆ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి. ఇప్పుడు అల్లు అర్జున్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడి చేతిలోనూ అంతే!
సందీప్ రెడ్డి వంగా చేతిలో రెండు...
'కబీర్ సింగ్' కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగా ట్రై చేశారు. అయితే, ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆ తర్వాత హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' స్టార్ట్ చేశారు. అందులో రష్మిక హీరోయిన్. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చేయనున్నారు. ఈ రెండు కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
2025 టార్గెట్ చేస్తూ...
Allu Arjun Sandeep Reddy Vanga movie aims 2025 release : అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా... ఇద్దరి టార్గెట్ 2025నే అని టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక... హీరో, దర్శకుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తారని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ఈ సినిమా తెరకెక్కించనున్నారు.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండది డాక్టర్ రోల్. మద్యానికి బానిసైన తర్వాత క్యారెక్టరైజేషన్ పూర్తిగా వేరే కోణంలో ఉంటుంది. 'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్ రోల్ చేయనున్నారు. మరి, అల్లు అర్జున్ కోసం ఎటువంటి క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెడీ చేశారో? సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా చాలా నెలలు ఉంది కాబట్టి, ఆ విషయం తెలుసుకోవడానికి అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు.
Also Read : కండలు పెంచిన మహేష్ బాబు - జిమ్‌లో సూపర్ స్టార్