Allu Arjun: సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు - ‘పుష్ప 2’పై క్లారిటీ ఇచ్చిన ఐకాన్ స్టార్ మేనేజర్
Allu Arjun: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ వదిలేసి హాలిడే ట్రిప్‌కు వెళ్లడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. దీంతో సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో హీరో మ్యానేజర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Allu Arjun: ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మనస్పర్థలు అనేవి కామన్. సినీ పరిశ్రమలో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ మధ్య అలాంటి మనస్పర్థలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ వదిలేసి వెళ్లిపోయారని టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. కొన్నిరోజులుగా ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే రెండున్నర సంవత్సరాల నుంచి ‘పుష్ప 2’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు, అంతే కాకుండా ఈ సినిమా పలుమార్లు పోస్ట్‌పోన్ కూడా అయ్యింది. ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం చర్చలకు దారితీస్తున్నాయి. అసలు సినిమా ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. దీంతో వీటిపై క్లారిటీ ఇవ్వడానికి ఐకాన్ స్టార్ మేనేజర్ ముందుకొచ్చారు.
నిజమైన సమాచారం..
అల్లు అర్జున్, సుకుమార్, ‘పుష్ప 2’ గురించే ట్విటర్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఫ్యాన్స్ అంతా ఒక్క క్లారిటీ ఇస్తే చాలు అంటూ తమ సందేహాలను బయటపెడుతున్నారు. దీంతో వారి సందేహాలను తీర్చడానికి అల్లు అర్జున్ మేనేజర్, డిజిటల్ కంటెంట్ హెడ్ అయిన శరత్ చంద్ర నాయుడు ముందుకొచ్చారు. ‘‘మాకు పుష్ప 2 షూటింగ్ గురించి అసలైన సమాచారం కావాలి’’ అంటూ ఒక ఫ్యాన్ ట్వీట్ చేశారు. దానికి శరత్ సమాధానమిచ్చారు. ‘‘సినిమా ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన ఎడిటింగ్‌ను సుకుమార్ ప్రారంభించారు. ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా బ్రేక్ తీసుకోవడం కామన్’’ అని తెలిపారు శరత్ చంద్ర నాయుడు.
Sukumar garu has started working on editing the first half of the film. It's very common to take a break during the editing.
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 18, 2024
డిసెంబర్ 6న రెడీ..
అల్లు అర్జున్ హాలిడేకు వెళ్లాడంటూ వస్తున్న వార్తలపై మరో ఫ్యాన్ ట్వీట్ చేశారు. ‘‘అదేదో షూటింగ్ పూర్తయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తయిన తర్వాత, లాంగ్ బ్రేక్ తీసుకోవచ్చు కదా’’ అని సలహా ఇచ్చారు. దానికి కూడా శరత్ చంద్ర నాయుడు రిప్లై ఇచ్చారు. ‘‘ఇప్పుడు టైమ్ ఉంది. ఫస్ట్ హాప్ పూర్తి చేసుకొని గ్రాఫిక్స్ పని అంతా రెడీగా పెట్టుకుంటే.. మిగిలిన ఎడిటింగ్ అంతా షూటింగ్ అయిపోయాక చేసుకుంటే డిసెంబర్ 6న హ్యాపీగా వచ్చేయచ్చు’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ హాలిడే వెళ్లిన మాట నిజమే. కానీ సుకుమార్‌తో ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటున్నారు.
Ippudu time undi. 1st half complete Chesukuni CG work antha ready pettukunte, remaining edit shoot aipoyaaka chesukunte December 6th happy ga vacheyyochu ga Karuna Thammudu.
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 18, 2024
Also Read: శ్రీదేవి హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ.. షూటింగ్‌లో చిన్నారి మరణం - షాకింగ్ విషయాలు చెప్పిన మురళీ మోహన్