By: ABP Desam | Updated at : 13 May 2023 02:34 PM (IST)
అల్లు అర్జున్ (Photo Credit: Allu Arjun/ Instagram)
హిందీలో ‘ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ’ పేరుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ మైఠలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్ (Allu Arjun) సంప్రదించినట్టు తెలుస్తోంది.
The Immortal Ashwatthama Movie Update : “అశ్వత్థామ అనేది ఆదిత్య ధర్ కలల ప్రాజెక్టు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను కథానాయకుడిగా తీసుకోవడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారు. ఈ చర్చలు దాదాపు సక్సెస్ అయినట్లే చెప్పుకోవచ్చు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది” అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తొలుత ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూ. ఎన్టీఆర్, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన అల్లు అర్జున్ పేర్లను మేకర్స్ పరిశీలించారు. వీరుకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకరిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని ఆదిత్య ప్రయత్నించారు. ఇందుకోసం ఇరువురితో చర్చలు జరిగాయి. చివరకు బన్నీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చాలా కాలంగా ఈ సినిమా గురించి బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో ‘ఉరి’ హీరో విక్కీ కౌశల్ ను హీరోగా తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరినీ పక్కన పెట్టేశారు.
సూపర్ హిట్ చిత్రం ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ తెరకెక్కించిన తర్వాత ఆదిత్య ధర్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే డ్రీమ్ ప్రాజెక్టు చేపట్టారు. గతంలో ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించేందుకు ఓకే చెప్పారు. ఆ సమయంలో విక్కీ కౌషల్ ను హీరోగా అనుకున్నారు. అయితే, కారణాలు బటయకు తెలియకపోయినా, ఈ ప్రాజెక్టు నుంచి రోనీ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ఆ సమయంలో హీరోగా రణ్ వీర్ సింగ్ ను తీసుకోవాలి అనుకున్నారు. తాజాగా వీరి స్థానంలో అల్లు అర్జున్ ను దాదాపు ఖరారు చేశారు. హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వత్థామ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో పాటు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం.
Also Read : 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?
Read Also: సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నజ్రియా - షాకింగ్ డెసిషన్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్లో మహేష్, ప్రభాస్తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !