అన్వేషించండి

Wake Up Team Pushpa : ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - మైత్రికి మాస్ వార్నింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. 'పుష్ప 2' యూనిట్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మీద యుద్ధం ప్రకటించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు కోపం వచ్చింది. బ్యానర్లతో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్ల మీద ధర్నా తరహాలో అభిమానులు అంతా ఏకం కావడమే కాదు... సోషల్ మీడియా వేదికగా కూడా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అభిమాన కథానాయకుడు నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie) చిత్ర బృందంపై మండి పడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అని వివరాల్లోకి వెళితే... 

'పుష్ప 2' టీమ్... మేలుకోండి!
అప్డేట్... ఒక్క అప్డేట్... 'పుష్ప 2' నుంచి ఒక్క అప్డేట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆ అప్డేట్ కోసమే 'పుష్ప 2' టీమ్ మీద ట్విట్టర్ వేదికగా ఎటాక్ చేస్తున్నారు. ఇప్పుడు 'వేకప్ టీమ్ పుష్ప' హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవల్ లో ట్రెండ్ అవుతోంది. 'పుష్ప 2' అప్డేట్ ఇవ్వడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇతర యూనిట్ సభ్యులపై ఆగ్రహాన్ని ఈ విధంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు 55 వేలకు పైగా #WakeUpTeamPushpa ట్వీట్స్ పడ్డాయి. 

ట్విట్టర్ ట్రెండ్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో 'మాకు పుష్ప అప్డేట్ కావాలి' (We Want Pushpa 2 Update) అంటూ బ్యానర్లు పట్టుకుని, స్లోగన్స్ వినిపిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, అనంతపురం, ఆసిఫాబాద్, కాకినాడతో పాటు కేరళలోని త్రిసూర్, ఒడిశాలోని గోపాలపూర్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అభిమానులు బ్యానర్లతో నిరసన తెలిపారు.

Also Read 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!

ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజుకు అయినా...
ఆగస్టు 8న మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బర్త్ డే. 'పుష్ప'లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. విలనిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 'పుష్ప 2' సినిమాలోనూ ఆయన పాత్ర కీలకమైనది. కనీసం ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు నాడు అయినా సరే ఒక అప్డేట్ ఇవ్వమని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే... మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. 

అప్డేట్ ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ఒకరు... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని మరొకరు... నువ్వు మగాడివి అయితే అప్డేట్ ఇవ్వమని ఇంకొకరు... సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు చేస్తున్న పోస్టులు శృతి మించి ఉంటున్నాయి. మాస్ వార్నింగ్స్ ఇస్తున్నారు.

Also Read మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?



'పుష్ప' విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. డిసెంబర్ 17, 2021లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా రోజుల సమయం తీసుకున్నారు. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత కూడా శరవేగంగా ఏమీ జరగడం లేదు. ఇప్పటికి 50 శాతం కూడా పూర్తి కాలేదని ఇండస్ట్రీ గుసగుస. దాంతో అభిమానుల కోపం కట్టలు తెంచుకుంటోంది. కొందరు అయితే సుకుమార్ దర్శకత్వం మీద నమ్మకం ఉంచమని ట్వీట్స్ చేస్తున్నారు. అదీ సంగతి!

గమనిక : సోషల్ మీడియాలో నెటిజనులు చేసిన పోస్టులకు ఏబీపీ దేశం ఎటువంటి బాధ్యత వహించదు. కొంత మంది చేసిన ట్వీట్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget