Allu Aravind: భారత సైనికులకు 'సింగిల్' సినిమా లాభాల్లో వాటా... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కీలక ప్రకటన
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం మీద రూపొందిన తాజా సినిమా '#సింగిల్'. మే 9న విడుదలైంది. ఈ సినిమా వసూళ్లలో కొంత భారత సైనికులకు అందించనున్నట్టు అరవింద్ ప్రకటించారు.

తీవ్రవాదం మీద తాము కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో భారత సైన్యం పాకిస్తాన్‌కు చెబుతోంది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగం మీద తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు... పాక్ సైనిక చర్యలను ధీటుగా తిప్పి కొట్టింది. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న మన సైన్యానికి తమ సినిమా వసూళ్లలో కొంత ఇవ్వనున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
సింగిల్ లాభాలలో సైనికులకు కొంత వాటా
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం మీద రూపొందిన రాజా సినిమా సింగిల్ మే 9ను థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి హిట్ టాక్ లభించడంతో యూనిట్ అంతా సంతోషం వ్యక్తం చేసింది. అయితే సరిహద్దుల్లో దేశ సంరక్షణ కోసం పోరాటం చేస్తున్న సైనికులకు తమ సినిమా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.
''భారత్ మాతా కీ జై! మా సపోర్ట్ ఎప్పుడు మన సైనికులకే! 'సింగిల్' వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నాం'' అని అల్లు అరవింద్ స్పష్టంగా చెప్పారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Also Read: '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?
శ్రీవిష్ణు హీరోగా నటించిన '#సింగిల్' సినిమాలో 'రొమాంటిక్' భామ కేతికా శర్మ, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా హీరోయిన్లు. స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిషోర్ హీరోతో పాటు ట్రావెల్ చేసే స్నేహితుడిగా సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
Also Read: శుభం రివ్యూ: నిర్మాతగా సమంత మొదటి సినిమా - హారర్ కామెడీతో నవ్వించారా? భయపెట్టారా?





















