Itlu Maredumilli Prajaneekam Teaser: పోలీసులు, ప్రజలూ హీరోనే కొడుతుంటే...
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా టీజర్ విడుదలైంది.
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆనంది కథానాయిక. ఈ రోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్ విషయానికి వస్తే... జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయని ప్రజలు నివసించే గిరిజన గ్రామాలకు ఎన్నికల అధికారులు వెళతారు. అక్కడ వాళ్ళకు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది కథగా తెలుస్తోంది.
'సాయం చేస్తే మనిషి. దాడి చేస్తే మృగం... మేం మనుషులమే సారూ! మీరు మనుషులు అయితే సాయం చేయండి' అని ఆనంది ఆవేదనతో చెబుతున్న మాట విటుంటే... గిరిజన గ్రామాలపై ఎవరో దాడి చేస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రసవ వేదన పడుతున్న మహిళను మంచం మీద తీసుకువెళడం చూస్తుంటే... ఇప్పటికీ వార్తల్లో కనిపించే అటువంటి దృశ్యాలు, కొన్ని గ్రామాల్లో పరిస్థితి గుర్తుకు రాక మానదు. 'మాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే ఎవరినీ వదలం' అని గిరిజన గ్రామంలో యువకుడు ఆగ్రహం వ్యక్తం చేయడం... అటు గిరిజన గ్రామాల్లో ప్రజలు, పోలీసులు హీరోను కొట్టడం సినిమాపై ఆసక్తి కలిగించాయి. నరేష్ 59వ చిత్రమిది.
సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్ చూస్తే... హిందీలో రాజ్ కుమార్ రావ్ నటించిన 'న్యూటన్' గుర్తుకు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ
'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్', 'బంగార్రాజు' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాల తర్వాత జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో.... హాస్య మూవీస్ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. 'వెన్నెల' కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల
Also Read : పవన్ కళ్యాణ్‌కు పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు
View this post on Instagram