By: ABP Desam | Updated at : 25 Aug 2023 10:04 PM (IST)
Image Credit: Srinivasa Silver Screen/Twitter
ఈమధ్యకాలంలో సినిమాలకు ఎంత కొత్తగా ప్రమోషన్ చేస్తే.. అంత ఎక్కువగా హైప్ వస్తుందని మేకర్స్ ఫీలవుతున్నారు. అందుకే కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు సినిమాల గురించి ప్రేక్షకులకు తెలియడానికి ఆడియో లాంచ్ అనేది చేసేవారు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రకరకాల పేర్లతో రకరకాల ఈవెంట్స్ చేస్తూ.. ప్రేక్షకుల దగ్గరకు నేరుగా వెళ్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘స్కంద’ ప్రమోషన్ కోసం ప్రీ రిలీజ్ థండర్‌ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. అనుకున్న సమయం కంటే ముందే ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
తెలుగులో యాక్షన్ సినిమాలంటే ఈతరానికి వెంటనే గుర్తొచ్చే దర్శకుడు బోయపాటి శ్రీను. ముఖ్యంగా బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఉండే క్రేజే వేరు. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించిందంటే చాలు.. రెండో ఆలోచన లేకుండా మూవీ హిట్ అయిపోయినట్టే. అలా అని బాలయ్య చేసే ప్రతీ మూవీ బోయపాటితో చేయడం కష్టం కదా.. అందుకే తన తరువాతి సినిమా కోసం రామ్ లాంటి యంగ్ హీరోను ఎంచుకున్నాడు ఈ యాక్షన్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్కంద’పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చాక్లెట్ బాయ్ రామ్.. పూర్తిస్థాయిలో యాక్షన్ సినిమా చేసి చాలాకాలం అయ్యింది. అందుకే తన ఫ్యాన్స్ అంతా ‘స్కంద’ కోసం ఎదురుచూస్తున్నారు.
చాలా సమయం ఉన్నా..
సెప్టెంబర్ 15న ‘స్కంద’ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. మూవీ రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నా కూడా ఇప్పటినుండే ప్రమోషన్స్ చేయడానికి మూవీ టీమ్ ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే సినిమా నుండి రెండు ఎనర్జిటిక్ పాటలు విడుదలయ్యాయి. ఈ పాటల్లో రామ్, శ్రీలీల కలిసి వేస్తున్న స్టెప్పులకే సినిమాకు చాలావరకు హైప్ క్రియేట్ అవుతోంది. పైగా బోయపాట సినిమా హీరోలాగా తన లుక్స్‌ను పూర్తిగా మార్చేశాడు రామ్. ఈ కొత్త లుక్‌లో క్రేజీ ఉన్నాడంటూ రామ్ లేడీ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. మూవీ విడుదలకు ఇంకా దాదాపు నెలరోజులు సమయం ఉన్నా కూడా అప్పుడే ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది ‘స్కంద’ టీమ్.
బోయపాటి కోసం బాలయ్య..
ఆగస్ట్ 26న ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా బాలయ్య వస్తున్న విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో మరెన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్.. తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ‘స్కంద’ ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలయ్యతో చేసిన ‘అఖండ’తో హిందీలో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి.. దీంతో ‘స్కంద’కు కూడా హిందీలో మంచి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నాడు.
Also Read: ముద్దు, శృంగార సన్నివేశాలు చేయడంపై ఎట్టకేలకు స్పందించిన అమిషా పటేల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!
ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?
Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
/body>