అన్వేషించండి

Alia Bhatt: రైటర్‌గా మారిన ఆలియా భట్ - సైలెంట్‌గా ఫస్ట్ బుక్ లాంచ్

Alia Bhatt: ఇప్పటికే యాక్టర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా, ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆలియా భట్.. ఇప్పుడు రైటర్‌గా కూడా మారింది. అంతే కాకుండా తాజాగా తన మొదటి పుస్తకాన్ని లాంచ్ చేసింది.

Alia Bhatt: చాలావరకు సినీ సెలబ్రిటీలు కేవలం యాక్టింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో కూడా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ఆశిస్తుంటారు. అలా చాలామంది ఇప్పటికే మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఆలియా భట్ కూడా చేరడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆలియా. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు తెరకెక్కుస్తోంది. ఇప్పుడు ఆలియా ఏకంగా ఒక రైటర్‌గా మారి బుక్ కూడా రిలీజ్ చేసేసింది.

పిల్లల కోసం..

చాలా తక్కువ సమయంలోనే ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేసి ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న నటి ఆలియా భట్. ఇప్పటికే యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏకంగా రైటర్‌గా మారి పిల్లలకు కథలు చెప్తానంటోంది. ఆలియా తాజాగా ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ ఎడ్ ఏ మమ్మా : ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ అనే పిల్లల పిక్చర్ బుక్‌ను రాసింది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ బుక్‌ను మార్కెట్లో లాంచ్ కూడా చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

కొత్త ప్రయాణం..

‘‘ఒక కొత్త అడ్వెంచర్ మొదలయ్యింది. ‘ఎడ్ ఏ మమ్మా’ అనే కొత్త బుక్ యూనివర్స్ నుంచి విడుదలయిన మొదటి పుస్తకమే ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’. నా చిన్నతనం మొత్తం కథలతో, కథలు చెప్పే వ్యక్తులతో నిండిపోయింది. అలా ఒకరోజు నాలోని చిన్నపిల్లను బయటికి తీసుకొచ్చి ఇతర పిల్లల కోసం ఒక పుస్తకం సిద్ధం చేశాను. ఈ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ రైటర్‌గా తన కొత్త ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది ఆలియా భట్. అంతే కాకుండా ఈ బుక్‌ను రెడీ చేయడం కోసం తనకు సాయం చేసిన కో రైటర్స్‌కు కూడా థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పుస్తకం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కూడా బుక్ స్టోర్స్‌లో లభిస్తోందని తెలిపింది ఆలియా భట్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

సొంత బ్రాండ్..

‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ పుస్తకం ఈ భూమిని ఎలా చూపుకోవాలి, పెట్స్‌తో ఎలా ఉండాలి అని పిల్లలకు చెప్తుందని ఆలియా భట్ అంటోంది. ‘ఎడ్ ఏ మమ్మా’ అనేది ఆలియా భట్ క్లోత్ బ్రాండ్. 2020లో ఎడ్ ఏ మమ్మా అనే పేరుతో కిడ్స్ వేర్, మెటర్నిటీ వేర్‌ను లాంచ్ చేసింది ఆలియా. ఇప్పుడు అదే పేరుతో ఒక బుక్ సిరీస్‌ను ప్రారంభించింది. పైగా అందులో మొదటి పుస్తకాన్ని తనే రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రైటర్‌గా, బ్రాండ్ ఓనర్‌గా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆలియా భట్.. యాక్టర్‌గా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ‘జిగ్రా’, ‘లవ్ అండ్ వార్’ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి.

Also Read: మరోసారి డీప్ ఫేక్‌కు బాధితురాలైన ఆలియా భట్ - రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget