అన్వేషించండి

Alia Bhatt: మరోసారి డీప్ ఫేక్‌కు బాధితురాలైన ఆలియా భట్ - రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్

Alia Bhatt: ఇప్పటికే ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీకి ఆలియా భట్ బాధితురాలు అయ్యింది. మరోసారి తాజాగా తననే దుండగులు టార్గెట్ చేయడంతో ఆలియా డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Alia Bhatt DeepFake Video: ఈరోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత మంచి చేస్తుందో.. అంతే చెడు కూడా చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. అలా దాని వల్ల జరిగే చెడు పరిణామాలు ఏంటని చాలా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో అయితే టెక్నాలజీ వాడకం అనేది శృతిమించిపోతోంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వల్ల చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చిరిస్తుండగా.. డీప్‌ఫేక్ అనే ఏఐ టెక్నాలజీ వల్ల సినీ సెలబ్రిటీల మొహాలు మార్ఫ్ చేసి అసభ్యకర వీడియోలు తయారు చేస్తున్నారు కొందరు దుండగులు. తాజాగా ఆలియా భట్‌కు సంబంధించిన మరో డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండోసారి..

మొదటిగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అప్పటివరకు డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీ కూడా ఉంటుందని తెలియని ప్రేక్షకులు.. నిజంగానే ఆ వీడియో ఉన్నది రష్మికనే అని నమ్మారు. మెల్లగా ఏఐకు చెందిన డీప్ ఫేక్ అని టెక్నాలజీ ద్వారా ఇలాంటివి చేయవచ్చని బయటపడింది. ఆ తర్వాత చాలామంది ఇలాంటి టెక్నాలజీ వల్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అయినా కూడా రష్మిక తర్వాత పలువురు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు కూడా ఈ టెక్నాలజీ వల్ల మార్ఫ్ అయ్యాయి. ఇప్పటికే ఆలియా భట్.. ఒకసారి దీనికి బాధితురాలు కాగా మరోసారి తన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సంచలనంగా మారింది.

ట్రెండ్ ఫాలో అవుతూ..

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే తాజాగా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్‌ను స్టార్ట్ చేశారు. ఆలియా భట్ కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొన్నట్టుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో తను బ్లాక్ కుర్తా వేసుకొని కనిపించింది. ఆ తర్వాత ఇది ఒక డీప్ ఫేక్ వీడియో అనే విషయం బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా ఆలియా.. ఒక వైట్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకొని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ కాగా అది డీప్ ఫేక్ వీడియో అనే విషయం సంచలనంగా మారింది. ఇప్పుడు మరోసారి కూడా డీప్ ఫేక్ ఉపయోగించే వారికి ఆలియా భట్ టార్గెట్‌గా మారింది.

ప్రభుత్వం చర్యలు..

మళ్లీ మళ్లీ డీప్ ఫేక్ టెక్నాలజీకి ఆలియా భటే బలవుతుండగా.. తన ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏఐ అనేది రోజురోజుకీ డేంజర్‌గా మారుతుందని, తమకు కూడా ఏఐ అంటే భయమేస్తుందని అంటున్నారు. ఏఐ అనేది ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకున్న ప్రభుత్వం సైతం ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి దానిని వైరల్ చేసేవారికి రూ.1 లక్ష జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. కానీ ఈ వీడియోలను ఎవరు తయారు చేస్తున్నారు, అవి ఎలా బయటికి వస్తున్నాయి అని కనుక్కోవడానికి పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది.

Also Read: ఆ వీడియోపై రూ.100 కోట్లు ప‌రువు న‌ష్టం దావా వేసిన ర‌వీనా టాండ‌న్ - అది ఫేక్ పోస్టా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
Hyderabad: చేతిలో పైసా లేకున్నా హైదారాబాద్ ఆర్టీసీలో ప్రయాణించవచ్చు- త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సేవలు
చేతిలో పైసా లేకున్నా హైదారాబాద్ ఆర్టీసీలో ప్రయాణించవచ్చు- త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సేవలు
Leader of Opposition: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ - ఎంపిక చేసిన I.N.D.I.A కూటమి నేతలు
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ - ఎంపిక చేసిన I.N.D.I.A కూటమి నేతలు
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Afghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABPJagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
Hyderabad: చేతిలో పైసా లేకున్నా హైదారాబాద్ ఆర్టీసీలో ప్రయాణించవచ్చు- త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సేవలు
చేతిలో పైసా లేకున్నా హైదారాబాద్ ఆర్టీసీలో ప్రయాణించవచ్చు- త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సేవలు
Leader of Opposition: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ - ఎంపిక చేసిన I.N.D.I.A కూటమి నేతలు
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ - ఎంపిక చేసిన I.N.D.I.A కూటమి నేతలు
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Google: సుందర్‌ పిచాయ్‌ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు
సుందర్‌ పిచాయ్‌ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు
Wikileaks Founder Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు విముక్తి.. జైలు నుంచి విడుదల 
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు విముక్తి.. జైలు నుంచి విడుదల 
Budget 2024: స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి మార్పు!, ఈసారి పెద్ద నిర్ణయం ఉండొచ్చు
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి మార్పు!, ఈసారి పెద్ద నిర్ణయం ఉండొచ్చు
Breast Cancer: మహిళలూ, మీ రొమ్ములు ఇలా మారుతున్నాయా? బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మహిళలూ, మీ రొమ్ములు ఇలా మారుతున్నాయా? బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Embed widget