Raveena Tandon: ఆ వీడియోపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన రవీనా టాండన్ - అది ఫేక్ పోస్టా?
Raveena Tandon : సెలబ్రిటీలకి సంబంధించి ఏదో ఒక వార్త, వీడియో, ఫొటో వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి వాటిని లైట్ తీసుకుని వదిలేస్తారు కానీ, ఒక్కోసారి మాత్రం చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది.
Raveena Tandon sends defamation notice to man who tweeted the video: ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక సెలబ్రిటీల గురించైతే కుప్పల తెప్పల వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి వాటిని చూసి లైట్ తీసుకుంటారు. కానీ, ఒక్కోసారి మాత్రం అవే సీరియస్ అవుతాయి. అలానే ఇటీవల బాలీవుడ్ నటి రవీనా టాండన్ కి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఇష్యూ ఏంటంటే?
ఇటీవల రవీనా టాండన్(Raveena Tandon React on Video)పై కొంతమంది దాడికి పాల్పన సంఘటనకు సంబంధించిన ఓ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోను షోషల్ మీడియాలో జర్నలిస్ట్ పేరుతో మొహ్సిన్ షేక్ అనే పేరుతో ఉన్న వ్యక్తి షేర్ చేశారు. ఇందులో రవీనా మరో ఇద్దరితో కారులో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును డ్యాష్ ఇచ్చినట్లు ఉంది. అయితే, ఆ వీడియోపై ఒక వ్యక్తి దృష్ప్రచారం చేశారు. రవీనా టాండన్ ఆ మహిళతో వాగ్వాదానికి దిగినట్లుగా చెప్పాడు. ఆ టైంలో ఆమె మద్యం తాగి ఉన్నారని చెప్తూ ఒక వార్తను వైరల్ చేశాడు. దీంతో ఆమె సదరు వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు. రూ.100 కోట్లకు ఆమె ఈ దావా వేశారు.
ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు...
Raveena Tandon defamation notice: ఈ విషయంపై రవీనా టాండన్ లాయర్ సనాఖాన్ స్పందించారు. రవీనాపై ఫేక్ వీడియోలను వైరల్ చేస్తూ, తప్పుడు వార్తలు రాసి ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. ఆమె పేరు వాడి డబ్బులు సంపాదించాలని చూసుకుంటున్నారని, ఇలాంటివి ఎవరు చేసినా సహించేది లేదని చెప్పారు. అందుకే, న్యాయపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఇక ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించారు. యాక్సిడెంట్ జరిగిన టైంలో డ్రైవర్ కారు నడిపాడని, ఆ రోజు డ్రైవర్, రవీనా ఎవ్వరూ మద్యం తాగలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ దాడికి సంబంధించి వైరల్ వీడియోలో రవీనా టాండన్ బయటికి వచ్చి తనను కొట్టవద్దని బతిమిలాడింది. పోలీసులు కూడా పరిశీలించిన వీడియోలో అదే ఉంది.
ఇక రవీనా కారు ఎవ్వరినీ ఢీకొట్టలేదని అర్థం అవుతుందని పోలీసులు చెప్పారు. ఇక ఈ ఇష్యూపై రవీనా కూాడా స్పందించారు. ఆమె అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ అంటూ ఆమె రాసుకొచ్చారు. డ్యాష్ కెమెరాలు, సిసీ కెమెరాల విలువేంటో నాకు తెలిసింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఈ ప్రమాదం నుంచి రవీనా అలనే బయటపడ్డారు. డ్యాష్ బోర్డ్ కమెరాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఆమె తప్పు లేదని తేల్చినట్టు సమాచారం.
Also Read: 'నన్ను నేను చాలా మిస్ అవుతున్నా'.. ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఎమోషనల్