Alia Bhatt Ranbir Kapoor Wedding Postponed: అలియా భట్ - రణ్‌బీర్ కపూర్ పెళ్లి వాయిదా! కన్ఫర్మ్ చేసిన ఆలియా సోదరుడు
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ అభిమానులకు షాక్. ఈ ప్రేమ పక్షుల పెళ్లి వాయిదా పడింది.
![Alia Bhatt Ranbir Kapoor Wedding Postponed: అలియా భట్ - రణ్‌బీర్ కపూర్ పెళ్లి వాయిదా! కన్ఫర్మ్ చేసిన ఆలియా సోదరుడు Alia Bhatt Ranbir Kapoor Wedding Postponed, No Wedding On April 14th Says Her Brother Rahul Batt Alia Bhatt Ranbir Kapoor Wedding Postponed: అలియా భట్ - రణ్‌బీర్ కపూర్ పెళ్లి వాయిదా! కన్ఫర్మ్ చేసిన ఆలియా సోదరుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/12/36c95c4f2066ad32b5b480085a3dda54_original.gif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Alia Ranbir Wedding Postponed: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి ఎప్పుడు? ముందుగా అయితే ఏప్రిల్ 14న... అంటే ఈ గురువారం అనుకున్నారు. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టారు. డెకరేషన్, లైటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతా రెడీ అనుకుంటున్న సమయంలో పెళ్లి వాయిదా పడింది. ఏప్రిల్ 14న పెళ్లి జరగడం లేదు. మహేష్ భట్ కుమారుడు, అలియా హాఫ్ బ్రదర్ రాహుల్ భట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
''పెళ్లి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే... ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో పెళ్లి జరగడం లేదు. నిజం చెప్పాలంటే... ఆ తేదీల్లో పెళ్లి చేయాలని అనుకున్నారు. మీడియాకు పెళ్లి తేదీ లీక్ కావడంతో ఒత్తిడి ఎక్కువ అయ్యింది. దాంతో ముహూర్తాన్ని మార్చారు. త్వరలో దీనిపై ప్రకటన వస్తుంది" అని జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ భట్ తెలిపారు. కొన్ని రోజుల కిందట ఏప్రిల్ 14న పెళ్లి అని మీడియాతో ఆలియా భట్ అంకుల్ రాబిన్ భట్ చెప్పారు. కుటుంబ సభ్యులే పెళ్లి తేదీ లీక్ చేశారన్నమాట.
Also Read: 'హైపర్' ఆది ఎక్కడ? 'జబర్దస్త్'లో ఎందుకు కనిపించడం లేదు?
అలియా - రణ్‌బీర్ పెళ్లి వాయిదా పడిందని మహేష్ భట్‌ను ప్రశ్నించగా... ఆయన ఏ విషయం చెప్పలేదు. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ పెళ్లి తేదీ గురించి బయట చెప్పవద్దని రిక్వెస్ట్ చేశారని, ఆమె విజ్ఞప్తిని తాను ఎలా కాదనగలనని మహేష్ భట్ ఎదురు ప్రశ్నించారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)